కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న కియారా..ఆ ఫోజులకే ఫిదా!
తాజాగా కియారా అద్వానీ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు.;
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా పేరు దక్కించుకుంది కియారా అద్వానీ.. అందం, అభినయంతో, నటనతో నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమెకు.. తెలుగులో మాత్రం సరైన అవకాశాలు తలుపు తట్టడం లేదు. తొలిసారి 2018లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన యాక్షన్ చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. పైగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కానీ ఈ సినిమా ప్రభావం కియారా అద్వానీపై పెద్దగా చూపించలేదు.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించినా కానీ ఈ సినిమాతో విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది. కొంతకాలం గ్యాప్ తీసుకొని గత ఏడాది మళ్లీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది ..దీంతో తెలుగులో ఈమెకు పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. ఇక ప్రస్తుతం అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇటు శాండిల్ వుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.
కియారా అద్వానీ తో పాటు నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఇక ఈ చిత్రాన్ని కన్నడ , ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తూ.. అటు తెలుగు , తమిళ్ , మలయాళం, హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేయనున్నారు. ఒకవైపు ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా మరొకవైపు కియారా అద్వానీ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగానే బ్రౌన్ కలర్ లెదర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో తన అందాలను ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. జుట్టును ఫ్రీగా వదిలేసిన కియారా తన బోసి నెక్ కి డైమండ్ చౌకర్ ను జత చేసింది. కాటుక కళ్ళతో కుర్రకారికి మత్తెక్కించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కియారా అద్వానీ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు. కొంతమంది నన్ను అడాప్ట్ చేసుకో అని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది మహారాణులకే మహారాణి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొక అభిమాని నిన్ను ఎంత ప్రేమించినా తక్కువే అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు.