ముద్దుగుమ్మ 290కేజీల వెయిట్ లిఫ్ట్
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసులుగా జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.;
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసులుగా జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించింది. అయితే జాన్వీ కపూర్ మొదటి సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయంలో శ్రీదేవి మృతి చెందింది. దాంతో జాన్వీ కపూర్‌ను వెండి తెరపై చూడకుండానే శ్రీదేవి వెళ్లి పోయింది. జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ స్టార్‌గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తెలుగులో జాన్వీ కపూర్ 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ సైతం సినిమాల్లో తన సత్తా చాటడం కోసం వేచి చూస్తుంది. ఇప్పటికే వచ్చిన పలు సినిమా ఆఫర్లు నిరాశను మిగిల్చాయి.
జాన్వీ కపూర్‌తో పోటీగా ఖుషి కపూర్
ఈ ఏడాదిలో ఖుషి కపూర్ ఇప్పటికే లవ్‌యాపా సినిమాతో పాటు మరో సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. జాన్వీ కపూర్‌తో పోల్చితే అందం విషయంలో ఖుషి కపూర్ వెనుక పడింది అనేది కొందరి మాట. జాన్వీ కపూర్ ఒక్క హిట్ లేకున్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి స్టార్ హీరోయిన్‌గా నిలిచిన విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే దారిన ఖుషి కపూర్ నడిచే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖుషి కపూర్ గత కొంత కాలంగా వరుసగా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో అందరికి షాకింగ్‌గా మారింది.
వెయిట్ లిఫ్టింగ్‌లో ఖుషి రికార్డ్
ఖుషి కపూర్ చూడ్డానికి సన్నగా, నాజూకుగా కనిపిస్తుంది. కానీ ఈమె ఏకంగా 290 కేజీల బరువును తన తొడ కండరాలతో, హిప్ తో లిఫ్ట్ చేసింది. సాధారణంగా ముద్దుగుమ్మలు సుకుమారంగా ఉంటారు అంటారు. కానీ ఖుషి కపూర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. బాబోయ్ ఇంత బరువు కండలు తిరిగిన మగవాళ్లకు సైతం సాధ్యం కాదు, అంత సులభంగా జాన్వీ కపూర్ ఎలా లిఫ్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉంటే ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తాయని గుర్తించి ఖుషి కపూర్ ఇలా వర్కౌట్‌లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ అంత అందంగా ఈమె మారాలని చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.
గ్లామర్ షో కి రెడీ అంటున్న ఖుషి కపూర్
ప్రస్తుతం ఖుషి కపూర్ చేతిలో సినిమాలు ఏమీ లేవు. వచ్చిన ఒకటి రెండు ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. ఈసారి ఒక మంచి కమర్షియల్ మూవీ చేయాలనే ఉద్దేశంతో ఖుషి ఉందని, అందుకే చిన్నాచితకా ఆఫర్లను ఆమె కాదన్నట్లు తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఖుషి కపూర్ గ్లామర్ షో చేసేందుకు సిద్ధం అని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. కమర్షియల్ పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీలో మనుగడ అనే విషయం ఇప్పటికి అయినా ఖుషి కపూర్ గుర్తించినట్లుగా ఉందని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోల కారణంగా వైరల్‌గా మారింది. కనుక ముందు ముందు అయినా ఈమెకు సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. తెలుగులో ఖుషి కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.