'ఖైదీ -2' తొలి షెడ్యూల్ అడవుల్లోనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.;

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ ఆ సినిమా రిలీజ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ నెలఖరు నుంచి ప్రచారం పనులు మొదలవుతాయి. అటుపై రిలీజ్ వరకూ లోకేష్ క్షణం తీరిక లేకుండా గడుపుతాడు. మరోవైపు లోకేష్ టీమ్ `ఖైదీ 2` పనుల్లో నిమగ్నమైంది. కూలీ రిలీజ్ అనంతరం లోకేష్ పట్టా లెక్కించాల్సింది ఈ చిత్రాన్నే. ఈ నేపథ్యంలో `కూలీ`తో సంబంధం లేకుండా ఎల్ సీయూ టీమ్ `ఖైదీ -2` కోసం పని చేస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రధాన పాత్రలు కూడా ఫైనల్ అయ్యాయి. ఇందులో హీరోయిన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. స్వీటీ అనుష్క ఎంపికైందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. 'ఖైదీ -2' తొలి షెడ్యూల్ కర్ణాకట అడవుల్లో ప్లాన్ చేస్తున్నారుట. అక్కడ అటవీ ప్రాంతాన్ని..దాన్ని అనుకున్న ఉన్న ఖాళీ ప్రదేశంలో సెట్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో సన్నివేశాలు సెట్ తో పాటు ఫారెస్ట్ లో తీయాల్సిన వాటికి లింక్ ఉండటంతో లోకేష్ ఆదేశాల మేరకు ఆ పనులు జరుగుతున్నట్లు తెలిసింది.
సాధారణంగా తొలి షెడ్యూల్ అంటే స్థానికంగా నిర్వహించడానికే మేకర్స్ చూస్తుంటారు. కానీ లోకేష్ అందుకు భిన్నం. చెన్నైకి బధులుగా కర్ణాటకలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేస్తుండటం విశేషం. గతంలో `లియో` షూటింగ్ కి సంబంధించి కూడా ఇలాగే చేసారు. తమిళ నాడుకు బధులు మరో రాష్ట్రలో తొలి షెడ్యూల్ మొదలు పెట్టారు. అటుపై తమిళనాడులో రెండవ షెడ్యూల్ పూర్తి చేసారు. `ఖైదీ-2` చిత్రీకరణ విషయం లోనూ లోకేష్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
అటు కార్తీ కూడా అన్ని సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకుని ప్రీ అయ్యాడు. `సర్దార్ -2` షూటింగ్ పూర్తయింది. అలాగే 'వా వాతయార్' కూడా ఇటీవలే పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. వాటికి డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఖైదీ 2 సెట్స్ కు వెళ్లే లోపు కార్తీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయనున్నారు.