వేధింపుల మాన్‌స్టార్ సినిమాలో దిశా ప‌టానీ?

ఆస్కార్ అవార్డు గ్రహీత, వేధింపుల రాక్ష‌సుడు కెవిన్ స్పేసీ కొన్నేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి, బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-01 09:40 GMT

ఆస్కార్ అవార్డు గ్రహీత, వేధింపుల రాక్ష‌సుడు కెవిన్ స్పేసీ కొన్నేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి, బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌డు త‌న సినిమాల సెట్స్ లో మేల్, ఫీమేల్ న‌టీన‌టుల‌ను లైంగికంగా వేధించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిలో కొన్ని నిరూప‌ణ అయ్యాయి. కోర్టు అత‌డికి చాలా శిక్ష‌లు విధించింది. అయినా అత‌డు ఇప్పుడు జైలు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత `హోలీ గార్డ్స్` అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇది సూప‌ర్ నేచుర‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఈ చిత్రంతో బాలీవుడ్ న‌టి దిశా ప‌టానీ హాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. ఇది దిశా ప‌టానీకి రెండో హాలీవుడ్ చిత్రం. దిశా ఇంత‌కుముందు జాకీ చాన్ స‌ర‌స‌న `కుంగు ఫూ యోగా` అనే చిత్రంలో న‌టించింది. ఇప్పుడు కెవిన్ స్పేసీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది అంతర్జాతీయ తారాగణం ఉన్న ఈ చిత్రంలో మెక్సికోలో చిత్రీకరిస్తున్నారు.

హోలీగార్డ్స్ అనేది స్టాటిగార్డ్స్ వర్సెస్ హోలీగార్డ్స్ అనే ఫ్రాంచైజీలో భాగం. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో ఇందులో సినిమాలు రూపొందుత‌న్నాయి. ఇప్ప‌టికే ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. ఈ మూవీ సెట్స్ నుంచి దిశా లుక్స్ కొన్ని విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఆన్ లొకేష‌న్ దిశా ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే దిషా మెక్సికోలోని డురాంగోలో టైరెస్ గిబ్సన్ , హ్యారీ గుడ్విన్స్ లతో కలిసి పైలెట్ షూటింగ్ లో పాల్గొంది. ఆ సన్నివేశాల నుండి తీసిన ఫుటేజ్ చాలా అద్భుతంగా ఉంది. దిశా పాత్ర విజువ‌ల్ గా అద్భుతంగా ఉందని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇందులో డాల్ఫ్ లండ్‌గ్రెన్, టైరీస్ గిబ్సన్, బ్రియానా హిల్డెబ్రాండ్ వంటి తారాగ‌ణం న‌టిస్తున్నారు.

దిశా ఈ ఏడాదిలో విడుదల కానున్న `వెల్‌కం 3`లోను న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో అక్ష‌య్ కుమార్ స‌హా ప‌లువురు అగ్ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. రొమాన్స్, యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

Tags:    

Similar News