అప్పుడు నచ్చనిది ఇప్పుడు రోజూ చేస్తున్నా : కీర్తి సురేష్
జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన కీర్తి సురేష్ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. ఫిట్‌నెస్ గురించి పంచుకోవడానికి ఇదే సరైన సమయం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
'మహానటి' ఫేం కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజను సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ దశల్లో ఉన్న ఆ సినిమాలతో కీర్తి సురేష్ మరింత ప్రేక్షకులకు దగ్గర కాబోతుంది. తెలుగులో ఈమె చేస్తున్న రౌడీ జనార్ధన సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో కీర్తి సురేష్ స్కిన్ షో కి పూర్తి దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు కాస్త మారిందా అనే అనుమానం కలిగే విధంగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత సాధారణంగా స్కిన్ షో తగ్గిస్తారు, కానీ కీర్తి సురేష్ మాత్రం స్కిన్ షో మొదలు పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్న వారు ఎక్కువ అయ్యారు. మరో వైపు కీర్తి సురేష్ ఫిజిక్ గురించి మాట్లాడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. గతంతో పోల్చితే కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో చాలా సన్నగా, నాజూకుగా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రామ్ కు జోడీగా నటించిన నేను శైలజ మూవీ...
కీర్తి సురేష్ కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉండేది. ముఖ్యంగా రామ్‌కు జోడీగా నేను శైలజ మూవీలో ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకు కీర్తి సురేష్ ఒక్కసారిగా తగ్గడంతో చాలా మంది ఆపరేషన్ చేయించుకుందా అన్నట్లుగా కామెంట్ చేశారు. ఇంత తక్కువ సమయంలో అంత బరువు తగ్గడం సాధ్యం కాదని కొందరు, కీర్తి సురేష్ ఏం ఆపరేషన్ చేయించుకుందో అంటూ మరికొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో పెద్దగా కీర్తి సురేష్ ఆ విషయమై స్పందించలేదు. కానీ తాజాగా కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసి ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ముఖ్యంగా తన ఫిజిక్ గురించి గతంలో వచ్చిన విమర్శలు, పుకార్లకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వీడియోను అందరితోనూ షేర్ చేసుకుంది.
కీర్తీ సురేష్ జిమ్ వీడియో వైరల్...
జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన కీర్తి సురేష్ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. ఫిట్‌నెస్ గురించి పంచుకోవడానికి ఇదే సరైన సమయం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ తన పోస్ట్‌లో... ఇప్పటి వరకు నా ఫిట్‌నెస్ గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. ప్రతి రోజు నా శరీరం గురించి, నా గురించి నేను ఏదో ఒక కొత్త విషయంను తెలుసుకుంటూ ఉన్నాను. 2013లలో నటిగా కెరీర్ ఆరంభించినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఆ సమయంలో జిమ్ అనేది నాలాంటి వారి కోసం కాదు అనుకునే దాన్ని, నా శరీరంకు జిమ్ అవసరం ఏంటని ఆసమయంలో భావించాను. కానీ 2018లో మహానటి సినిమా తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో ఎందుకు జిమ్ ట్రై చేయకూడదని ఆలోచించాను. అప్పుడు మొదలు పెట్టిన నా వర్కౌట్స్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. కేవలం 9 నెలల్లో ఏకంగా 10 కేజీల బరువు తగ్గాను. నన్ను చిన్నచూపు చూసిన వారందరికీ సమాధానంగా నిలిచాను.
టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్...
ఒకానొక సమయంలో నేను జిమ్ కి పోడం అవసరం లేదు అనుకున్నాను, జిమ్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు జిమ్ చేయని రోజు ఏదోలా ఉంటుంది. జిమ్ కి వెళ్లడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడం బాగుంది. జిమ్‌ను అలవాటుగా మార్చుకోవడం అన్ని విధాలుగా మంచి పద్దతి అన్నట్లుగా కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. తన జిమ్ కోచ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసింది. హీరోయిన్‌గా కీర్తి సురేష్ ఇంతకు ముందు చీర కట్టు, నిండైన డ్రస్ ల్లో కనిపించేది. ఈ మధ్య కాలంలో సన్నగా నాజూకుగా ఉండటం వల్ల మోడ్రన్ డ్రెస్‌ల్లోనూ చాలా అందంగా కనిపిస్తుందనే ప్రశంసలు దక్కించుకుంటుంది. కీర్తి సురేష్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అందాల ఆరబోత మొదలు పెట్టిన ఈ అమ్మడికి కచ్చితంగా ముందు ముందు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రావడం ఖాయం.