ప్రయోగాలు ఆపని క్రేజీ స్టార్ హీరోయిన్!
వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా భాషలన్నీ చుట్టేస్తోంది క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్.;
వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా భాషలన్నీ చుట్టేస్తోంది క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్. 'మహానటి'తో జాతీయ పురస్కారాన్ని దక్కించుకుని తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచిన కీర్త సురేష్ మిగతా స్టార్ హీరోయిన్‌లకు పూర్తి భిన్నంగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే అదే సమయంలో తన రేంజ్‌కి, తన స్టార్‌డమ్‌కు మ్యాచ్ కానీ యంగ్ హీరోలతోనూ నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో చిన్న సినిమాలు, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లలో నటిస్తోంది.
కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఐదు భాషల ఇండస్ట్రీలని చుట్టేస్తూ దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ మూవీస్, యాక్షన్ డ్రామాస్, రివేంజ్ డ్రామాల్లో నటిస్తూ వెర్సటైల్ స్టార్ అనిపించుకుంటోంది. తమిళంలో `కన్నివేడి`లో నటిస్తున్న కీర్తి తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోల డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా `రౌడీ జనార్థన`లో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇందులో నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతోంది. రౌడీతో కలిసి కీర్తి ఫస్ట్ టైమ్ చేస్తున్న సినిమా కావడం, పీరియాడికల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్‌లో రౌడీ జనార్ధనగా సరికొత్త పాత్రలో కనిపించనుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే కీర్తి సురేష్ మరో మలయాళ సినిమాని లైన్‌లో పెట్టేసింది.
అదే `తోట్టం`. రిషి శివకుమార్ దర్శకుడు. ఆంటోనీ వర్గీస్ హీరో. ఇదొక థ్రిల్లర్. రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. డార్క్ ఇంటెన్స్ టోన్‌తో ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుందనే సంకేతాల్ని అందిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేష్ వింటేజ్ బ్రౌన్ కలర్ ఔట్‌ఫిట్ ధరించి..లేస్ ఊడిన షూస్.. చుట్టూ కమ్మేసిన పొగ.. చేతిలో పగిలి రక్తం కారుతున్న గ్లాస్..కాళ్లచుట్టూ పగిలినబాటిల్స్, బుల్లెట్స్ కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది.
ఇందులో విశేషం ఏంటంటే 'అర్జున్‌రెడ్డి', కబీర్‌సింగ్', యానిమల్ మూవీస్‌కి సంగీతం అందించిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. కీర్తి థ్రిల్లర్ మూవీకి హర్షవర్థన్ మ్యూజిక్ చేస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే సినిమాని పాన్ ఇండియా మూవీగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.