మహానటి ఆ గ్యాప్ ను ఎలా మ్యానేజ్ చేస్తుందో?
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్, హీరోల కెరీర్ లానే ఉండదు. ఎన్నో సవాళ్లుంటాయి ఎప్పటికప్పుడు తమను తాము ప్రూవ్ చేసుకుంటూ కెరీర్లో సక్సెస్‌లు అందుకుంటూ ఉంటేనే కొత్త అవకాశాలు వస్తాయి.;
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్, హీరోల కెరీర్ లానే ఉండదు. ఎన్నో సవాళ్లుంటాయి ఎప్పటికప్పుడు తమను తాము ప్రూవ్ చేసుకుంటూ కెరీర్లో సక్సెస్‌లు అందుకుంటూ ఉంటేనే కొత్త అవకాశాలు వస్తాయి. లేదంటే పెళ్లైంది కదా అని దర్శకనిర్మాతలు లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే మహానటి కీర్తి సురేష్ మాత్రం పెళ్లి తర్వాత తన జోష్ ను బాగా పెంచింది.
పెళ్లి తర్వాత నెమ్మదించిన కెరీర్
గతేడాది డిసెంబర్ లో తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, పెళ్లి తర్వాత తన యాక్టింగ్ కెరీర్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకుందని ఆమె చేసే పనుల ద్వారా అందరికీ అర్థమయ్యేలా చేసింది. అందుకే ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కీర్తి త్వరలోనే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని ఆశించారు. అలా అందరూ అనుకునేలా చేసింది కూడా కీర్తినే.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
పెళ్లి ముందు కంటే తర్వాతనే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ తో టచ్ లో ఉండటానికి రెగ్యులర్ గ్లామరస్ ఫోటోషూట్స్, అప్డేట్స్ ను షేర్ చేస్తూ వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఇస్తున్న అప్డేట్స్ చూసి కీర్తి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే కీర్తి పెళ్లి చేసుకుని 9 నెలలవుతున్నా ఇప్పటికీ తెలుగులో ఒక్క కొత్త సినిమాను కూడా ఆమె అనౌన్స్ చేసింది లేదు.
స్టార్‌డమ్, క్రేజ్, ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కీర్తికి ఆశించిన రాలేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీర్తిని హీరోయిన్ గా తీసుకోవడానికి డిస్కషన్స్ జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నితిన్ తో కలిసి ఎల్లమ్మ కోసం అడిగారని కూడా అన్నారు. కానీ వాటిలో ఏ అవకాశం కూడా కీర్తిని వరించలేదు. మరి ఈ గ్యాప్ ను కీర్తి ఫ్యూచర్‌లో ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి.