మహానటి తర్వాతే అందం గురించి ఆలోచన : కీర్తిసురేష్‌

ముఖ్యంగా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ లో చాలా మార్పులు వచ్చాయి అని చాలా మంది అంటూ ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని కీర్తి ఒప్పుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.;

Update: 2025-11-22 17:30 GMT

మలయాళ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి, తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని, తెలుగులో చేసిన మహానటి సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సినిమా ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ కావడంతో ఇండస్ట్రీలో బాల నటిగానే అడుగు పెట్టిన కీర్తి సురేష్ హీరోయిన్‌గానూ ఈజీగానే అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇండస్ట్రీలో దక్కిన అవకాశంను సక్సెస్‌గా మార్చుకోవడంకు కీర్తి సురేష్‌ చాలానే కష్టపడింది. కెరీర్ ఆరంభంలో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్ళింది. కానీ తర్వాత తర్వాత కెరీర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతూ కీర్తి సురేష్ కష్టపడుతూ వచ్చింది. ముఖ్యంగా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ లో చాలా మార్పులు వచ్చాయి అని చాలా మంది అంటూ ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని కీర్తి ఒప్పుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా రివాల్వర్‌ రిటా...

సాధారణంగా హీరోయిన్స్‌ సన్నగా నాజూకుగా ఉండటం కోసం ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. తినేది తక్కువ, వర్కౌట్స్ చేసేది చాలా ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కీర్తి సురేష్‌ మాత్రం కెరీర్‌ ఆరంభంలో తినే విషయంలో అస్సలు రాజీ పడేది కాదట. ఇటీవల ఆమె నటించిన రివాల్వర్ రీటా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంది. ఒక కార్యక్రమంలో భాగంగా తన ఆహారపు అలవాట్ల గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో తాను ఒకేసారి 10 ఇడ్లీలను తినేదాన్ని అని చెప్పింది. తినడం మొదలు పెట్టి పది ఇడ్లీలను ఈజీగా తినడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవారు, కేవలం ఇడ్లీలు మాత్రమే కాకుండా దోశలను సైతం నేను ఈజీగా పది తినేదాన్ని. పది దోశలు బ్యాక్ టు బ్యాక్ నేను తినడం చూసి బాబోయ్‌ ఏంటి ఆ తిండి అనుకునే వారు కూడా ఉండేవారని కీర్తి సరదాగా చెప్పుకొచ్చింది.

ఇడ్లీలు, దోశలతో కీర్తి సురేష్‌ బరువు...

నటిగా కొనసాగాలంటే కొన్నింటి విషయాల్లో త్యాగం అవసరం. అందుకే ఆహారం నియంత్రించుకోవడంతో పాటు, రెగ్యులర్‌ వర్కౌట్స్ మొదలు పెట్టాను. కెరీర్ ఆరంభంలో నా వర్కౌట్స్ తో, డైట్ కంట్రోల్‌తో 10 నుంచి 12 నెలల్లో దాదాపుగా 10 కేజీల బరువు తగ్గాను. నటించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అనే విషయం తెలుసుకోవాలి. అందుకే నేను ఆరోగ్యంను కాపాడుకోవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా మహానటి సినిమా విడుదల అయిన తర్వాత నేను ఎక్కువగా ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవడం మొదలు పెట్టాను. అంతే కాకుండా అప్పటి నుంచే అందం గురించి ఆలోచించడం మొదలు పెట్టి, బరువు తగ్గేందుకు మరింతగా ప్రయత్నాలు చేశాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. రెగ్యులర్‌ వర్కౌట్‌ అనేది ఇప్పుడు నా జీవితంలో భాగం అయిందని కీర్తి పేర్కొంది.

టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండకు జోడీగా...

కోలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లో గెస్ట్‌గా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వెళ్తోంది. చాలా గ్యాప్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాతో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్‌ కి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇటీవల తన చిరకాల మిత్రుడితో ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి సురేష్‌, పెళ్లి తర్వాత కూడా చాలా బిజీగానే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు తమిళ సినిమాలతో పాటు, రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా ఉంది. అదే సమయంలో వెబ్ సిరీస్‌ ల్లో నటించే ఆలోచనతోనూ కీర్తి సురేష్ ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ప్రకటన త్వరలో వచ్చినా ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News