కేడీ ది డెవిల్‌కు శిల్పా చెప్పిన కొత్త సెంటిమెంట్
కన్నడ యాక్షన్ హీరో ధృవ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కేడీ ది డెవిల్.;
కన్నడ యాక్షన్ హీరో ధృవ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కేడీ ది డెవిల్. రీష్మా నానయ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు సినిమాలోని కీలక సభ్యులంతా హాజరయ్యారు.
హైదరాబాద్ తో తనకెంతో స్పెషల్ బాండింగ్ ఉందని, టాలీవుడ్ లోని చాలా మందితో తాను వర్క్ చేశానని, ఇక్కడ దొరికే ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని సంజయ్ దత్ అన్నారు. ప్రస్తుతం తాను ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నానని, అందులో భాగంగానే తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని, చిరంజీవి గారికి తానెంతో పెద్ద ఫ్యాన్ ను అని ఆయన తెలిపారు. కేడీ ది డెవిల్ సినిమాను నిర్మాతలు చాలా గ్రాండ్ గా నిర్మించారని, అలా చేయడానికి వారికి సినిమాపై ఉన్న ప్యాషనే కారణమని ఆయన చెప్పారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా అద్భుతమైన వ్యక్తి అని, ధృవ తనకు తమ్ముడు లాంటి వాడని, రీష్మా చాలా గొప్ప నటి అని, శిల్పా శెట్టితో కలిసి వర్క్ చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని సంజయ్ దత్ అన్నారు.
కేడీ మూవీకి వర్క్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పిన ధృవ సర్జ, తాను సంజయ్ దత్ ను ఎంతగానో ఆరాధిస్తాననని, ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. శిల్పా శెట్టి లాంటి టాలెంటెడ్ నటులుతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుందని, తమ పెర్ఫార్మెన్స్ లో ఏమైనా తప్పులుంటే వారిని కరెక్ట్ చేయడంలో ఆమె చాలా హెల్ప్ చేస్తారని, రీష్మా చాలా మంచి నటి అని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే తమ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.
ఈ సినిమా టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదని డైరెక్టర్ ప్రేమ్ అన్నారు. తాను రెగ్యులర్ గా చిరంజీవి గారి ఇంటికి వెళ్తుంటానని, అందులో భాగంగానే ఎక్కువగా తెలుగు సినిమాలు కూడా చూస్తుంటానని చెప్పారు. ఈ సినిమా జర్నీ మొత్తంలో ధృవ తనకు తోడుగా నిలిచాడని, ఈ సినిమాలో నటించినందుకు సంజయ్ బాబాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఆయన తానెప్పుడూ సంజూ బాబాను అభిమానిస్తుంటానని తెలిపారు. షూటింగ్ టైమ్ లో శిల్పా శెట్టి చాలా కోపరేట్ చేశారని, రీష్మా మంచి టాలెంటెడ్ నటి అని చెప్పిన ప్రేమ్, ఇప్పటికే తమ సినిమా ఆడియన్స్ లో రికార్డులను సృష్టించిందన్నారు.
తన మొదటి సినిమా హిందీలో కాదని, తెలుగులో అని.. సాహసవీరుడు సాగరకన్య సినిమా చేసినప్పటి నుంచి తెలుగు ఆడియన్స్ తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని, ఈ సినిమాలో సత్యవతి క్యారెక్టర్ ను ఇచ్చినందుకు డైరెక్టర్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు శిల్పా శెట్టి. నిర్మాత వెంకట్‌కు సినిమాపై ఎంతో ప్యాషన్ ఉందని చెప్పిన ఆమె ధృవ, రీష్మాతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. సంజయ్ దత్ తో తాను చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతుందని ఈ సినిమా విషయంలో కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందనుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
కేడీ ది డెవిల్ మూవీ తనకెంతో స్పెషల్ అని చెప్తున్నారు హీరోయిన్ రేష్మా నానయ్య. సంజయ్ దత్ గారు చాలా గొప్ప వ్యక్తి అని, ప్రతీ విషయాన్నీ ఎంతో ఓపికగా వింటారని, శిల్పా మేడమ్ వల్ల సెట్స్ లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నట్టు రేష్మ తెలిపారు. ధృవ్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పిన రేష్మా కెవీఎన్ లాంటి గొప్ప బ్యానర్ లో వర్క్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
ఇప్పటిఏ కేడీ ది డెవిల్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుందని అన్నారు కెవిఎన్ ప్రొడక్షన్స్ బిజినెస్ హెడ్ సుప్రీత్. ఇంతటి పవర్‌ఫుల్ మాస్ టీజర్ ను ఇచ్చినందుకు ప్రేమ్ కు థ్యాంక్స్ చెప్పారు. బిజీ షెడ్యూల్ లో కూడా సంజయ్ దత్ తమతో పాటూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారని, టీజర్ లో చూసింది చాలా తక్కువని, సినిమా ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరచడం ఖాయమని చెప్పిన ఆయన త్వరలోనే కొచ్చి, బెంగుళూరు, చెన్నైల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.