ఇది క్రైమ్ అరెస్ట్ చేయాలి.. క‌త్రిన-విక్కీ ప్రైవ‌సీపై దాడి!

క‌త్రిన‌- విక్కీ కౌశ‌ల్ దంప‌తుల గోప్య‌త‌కు భంగం క‌లిగిస్తూ చిత్రీక‌రించిన ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ లోకి రాగానే చాలా మంది మీడియా వ్య‌క్తుల‌ను ఇష్టానుసారం తిట్టారు.;

Update: 2025-11-01 17:03 GMT

సెల‌బ్రిటీల ఇళ్ల‌లోకి జొర‌బ‌డి వారి ప్ర‌యివేట్ జీవితాన్ని లైవ్ టెలీకాస్ట్ చేయ‌డం టీవీ చానెళ్ల‌కు స‌రైన‌దేనా? దీనిని మీడియా అతి అనుకోవాలా? లేక వృత్తి నిబ‌ద్ధ‌త క‌మిట్ మెంట్ అని స‌రిపెట్టుకోవాలా? ఇప్పుడు క‌త్రిన కైఫ్ - విక్కీ కౌశ‌ల్ దంప‌తుల సాన్నిహిత్యానికి గోప్య‌త లేకుండా పోయింది. వారు త‌మ ఇంట్లో ఎంతో స‌న్నిహితంగా ఉన్న‌ప్పుడు, బేబి బంప్‌తో ఉన్న క‌త్రిన ఫోటోలు, వీడియోల‌ను ర‌హ‌స్యంగా చిత్రీక‌రించి మీడియాలో టెలీకాస్ట్ చేయ‌డం స‌రైన‌దేనా..!

క‌త్రిన‌- విక్కీ కౌశ‌ల్ దంప‌తుల గోప్య‌త‌కు భంగం క‌లిగిస్తూ చిత్రీక‌రించిన ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ లోకి రాగానే చాలా మంది మీడియా వ్య‌క్తుల‌ను ఇష్టానుసారం తిట్టారు. ఇది క్రైమ్ అవుతుంద‌ని సోనాక్షి సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్ర‌యివేట్ ఫోటోలు వీడియోలు తీయ‌డం మీడియాకు స‌రైన‌దేనా ? పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలి! అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. వారిని ఇలా ఇబ్బంది పెట్ట‌డం స‌రికాద‌ని చాలా మంది వ్యాఖ్యానించారు.

ఆ వ్య‌క్తి ఎవ‌రో బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా కొంద‌రు నిల‌దీసే ప్ర‌య‌త్నం చేసారు. ఇంత‌కుముందు ఆలియా భట్ బేబీ బంప్ ఫోటోలు అభిమానులను తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసాయి. 2022లో తన కుమార్తె రాహాతో గర్భవతిగా ఉన్నప్పుడు ఆలియా భట్ అనుమతి లేకుండా తన ఇంటి బాల్కనీ నుండి ఫోటోలు తీసిన మీడియా వ్య‌క్తిపై తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. పొరుగున ఉన్న భ‌వ‌నం పై నుంచి త‌న‌ను ఏవో కళ్లు గ‌మ‌నిస్తున్నాయ‌ని తెలుసుకుని భ‌య‌ప‌డిపోయాన‌ని ఆలియా అన్నారు. టెర్రస్ పై ఇద్ద‌రు వ్య‌క్తులు నాపైకి కెమెరాను ఉంచార‌ని తెలుసుకున్నాను. అనుమ‌తి లేకుండా ఇలా ఎలా చేస్తారు? అంటూ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ఆలియా.

2025 సెప్టెంబర్‌లో కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మా జీవితంలోని ఉత్తమ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము అంటూ ఆనందం వ్య‌క్తం చేసారు.

జూలైలో ముంబైలోని ఫెర్రీ పోర్టులో ఈ జంట షికార్ కి సంబంధించిన‌ వీడియో వైరల్ కావడంతో బేబి బంప్ గురించి క‌థ‌నాలొచ్చాయి.



Tags:    

Similar News