• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజిని కోసం కరుణానిధి...

రజిని కోసం కరుణానిధి సాక్రిఫైజ్..!

| దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి డైలాగ్స్ రాస్తే ఆ సినిమాలో తాను నటించలేనని రజిని వెల్లడించారు. ఇంతకీ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియాలంటే 1980 లోకి వెళ్లాలి.

By - Tupaki Desk
Update: 2023-10-05 16:30 GMT

సూపర్ స్టార్ రజినికాంత్ కరుణానిధి శత జయంతి ని పురష్కరించుకుని మురసోలి దిన పత్రికలో రాసిన వ్యాసం వైరల్ గా మారింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి డైలాగ్స్ రాస్తే ఆ సినిమాలో తాను నటించలేనని రజిని వెల్లడించారు. ఇంతకీ అసలు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియాలంటే 1980 లోకి వెళ్లాలి. 1980లో ఒక సినిమాలో నటించడానికి తను ఓకే చెప్పగా ఆ సినిమాకు డైలాగ్స్ రాసేందుకు కరుణానిధి ఒప్పుకున్నారని నిర్మాత చెప్పారు. కరుణానిధి డైలాగ్స్ అనగానే తనకు కంగారు పుట్టిందని అన్నారు రజినికాంత్.

ఆ టైం లో తమిళం మాట్లాడటానికి కష్టపడుతున్న తానూ ఏకంగా కరుణానిధి సంభాషణలు మాట్లాడుతూ నటించడం కాని పని అనుకున్నారట. అందుకు బదులుగా కర్ణాటక వెళ్లి బస్సుల్లో టికెట్లు కొట్టుకుంటానని అనిపించిందట. అవకాశం కల్పిస్తే ఆయన్ను కలిసి ఆ విషయం చెబుతా కరుణానిధి సంభాషణలు రాస్తే నటించనని చెప్పారట. నిర్మాత అయిష్టంగానే గోపాలపురంలో కరుణానిధి కలిసే ఏర్పాటు చేయగా సాధారణ తమిళం మాట్లాడానికె ఇబ్బంది పడుతున్నా.. మీ సంభాషణలు ఎలా మాట్లాడగలను అని అన్నారట. అది అసాధ్యం తప్పుగా భావించవద్దని రిక్వెస్ట్ చేశారట.

ఆయన నవ్వుతూ ఎవరికెలా డైలాగ్స్ రాయాలో తెలుసని కరుణానిధి రజినితో చెప్పారట. ఎం.జి.ఆర్ కు రాసినట్తు శివాజి గణేషన్ కు రాయనని.. శివాజి గణేషన్ కి రాసినట్టు ఎం.జి.ఆర్ కు రాయనని చెప్పగా.. అప్పటికీ తను మౌనంగా ఉండటాన్ని అర్థం చేసుకుని తప్పుగా అనుకోను ఇంతకుముందు సినిమాకు ఎవరు రాశారో వారినే రాయనీ అని చెప్పారట కరుణానిధి.

నిర్మాతని పిలిచి షూటింగ్ ఈ నెల 10 నే అంటున్నారు.. నేను నెక్స్ట్ మంత్ అనుకుని డైలాగ్స్ రాయడానికి ఒప్పుకున్నా.. నాకు సాధ్యపడదు.. తర్వాత సినిమాకు చూద్దామని అన్నారట. ఆ తర్వాత తనని చూసి సంతోషంగా అని అడిగారు.. నిర్మాతని ఇబ్బంది పెట్టకుండా తన కోరిక మన్నించారంటూ కరుణానిధి స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నారు రజినికాంత్. రజిని సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా జైలర్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ తన నెక్స్ట్ మూవీ టీ.జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా లో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది.

Tags:    
  • Kollywood 
  • Rajinikanth 
  • Karunanidhi 
  • Writer 
  • Murasoli 
  • Article 
  • Producer 
  • Dialogues 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS