శ్రీ‌లీల ప్రేమ‌లో పాపం పిచ్చోడు!

అత‌డు గుబురుగా పెరుగుతున్న గ‌డ్డం.. చింపిరి జుత్తును కూడా మ‌ర్చిపోయాడు. అంతగా పారూ కోసం ప్రేమ‌లో మునిగిపోయాడు పాపం.;

Update: 2025-06-21 05:20 GMT

అత‌డు నిండా ప్రేమ‌లో మునిగాడు. పార్వ‌తి కోసం త‌పించే దేవ‌దాస్ లా, అనార్క‌లి కోసం ప‌డిచ‌చ్చే స‌లీమ్ లా, లైలా కోసం ఎంత‌కైనా తెగించే మ‌జ్నూలా మారాడు. ప్రేమ గుడ్డిది.. అందుకే ఇంత‌టి తీవ్ర‌మైన నిర్ణ‌యాలు.. ఇప్పుడు శ్రీ‌లీల‌తో అలాంటి గుడ్డి ప్రేమ‌లోనే ఉన్నాడు బాలీవుడ్ యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్. ఈ తెలుగ‌మ్మాయితో అత‌డు నిండా ప్రేమ‌లో మునిగాడు. చూపు చూపు క‌లిసిన వేళ మ‌న‌సు మాట విన‌ని స్థితిలో అతడు ఒక దేవ‌దాస్‌లా, ఒక మ‌జ్నూలా పిచ్చోడైపోయాడు.

ఈ ప్రేమ‌క‌థ ఏ కంచికి చేరుతుందో కానీ, ఇప్ప‌టికే ఆరుబ‌య‌ట అన్నీ పుకార్లే. ఇదంతా సినిమా కోసం అని కొంద‌రంటారు. కాదు నిజ జీవితంలోనే నిండా మునిగార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏది నిజం అన్న‌ది అటుంచితే, అనురాగ్ బసు ప్రేమకథకు కార్తీక్ ఆర్యన్ ప్రాణం పెట్టేస్తున్నాడ‌ని తాజాగా రివీలైన అత‌డి లుక్ చెబుతోంది.

అత‌డు గుబురుగా పెరుగుతున్న గ‌డ్డం.. చింపిరి జుత్తును కూడా మ‌ర్చిపోయాడు. అంతగా పారూ కోసం ప్రేమ‌లో మునిగిపోయాడు పాపం. ఒక‌ప్పుడు దిలీప్ కుమార్ ని మాత్ర‌మే భార‌తీయ ప్ర‌జ‌లు దేవ‌దాస్ లా చూసారు. ఇంత‌కాలానికి మ‌ళ్లీ కార్తీక్ ఆర్య‌న్ ని మాత్ర‌మే చూడ‌గ‌లుగుతున్నారు. కార్తీక్ త‌న పాత్ర‌లో లీన‌మ‌య్యేందుకు, లుక్ అండ్ ఫీల్ రావ‌డం కోసం చాలా కాలంగా కునుకు మానేశాడు. ఎవ‌రితోను మాట్లాడ‌టం లేదు. ఒంట‌రిగా ఉంటున్నాడు. ఇదంతా మెథ‌డ్ యాక్టింగ్ మోడ్.. అని కూడా చెబుతున్నారు. నిజానికి ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా ఒక న‌టుడు ఇలా డెడికేట్ అవ్వ‌డం అన్న‌ది చాలా అరుదు అని కూడా కితాబిచ్చేస్తున్నారు.

దిలీప్ కుమార్ దేవదాస్ కోసం ఎలాంటి శ్ర‌మ‌, అంకిత‌భావాన్ని క‌న‌బ‌రిచారో అలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ అంకిత‌భావాన్ని కార్తీక్ ఎంచుకున్నాడ‌ని కూడా చెబుతున్నారు. కార్తీక్ ఇంత‌కుముందు చందు చాంపియ‌న్ కోసం త‌న శ‌రీరాన్ని మార్చుకున్న తీరు, మేకోవ‌ర్ కూడా ఎంతో క‌ఠిన‌మైన‌ది. అందుకే ఇప్పుడు అత‌డి మేకోవ‌ర్ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. చేసే ప‌నికి వంద‌శాతం డెడికేట్ అవ్వ‌డం కార్తీక్ కే చెల్లింది. అందుకే బాలీవుడ్ లో రాజ‌కీయాలు కూడా అత‌డిని ఏమీ చేయలేవు. శ్రీలీల ఇలాంటి ఒక గొప్ప న‌టుడి స‌ర‌స‌న‌ బాలీవుడ్ కి పరిచ‌య‌మ‌వ్వ‌డం అదృష్టం. కార్తీక్- శ్రీ‌లీల జంట మేడ్ ఫ‌ర్ ఈచ్ అదర్. అందులో నో డౌట్. అది సినిమా కోసం అయినా, లేదా ఆఫ్ ది రికార్డ్ అయినా...! కార్తీక్ తో పోటీప‌డుతూ పారూ పాత్ర‌లో శ్రీ‌లీల ఏ మేర‌కు రాణిస్తుందో కూడా వేచి చూడాలి. ఆషిఖి 2 నిర్మాత‌ల నుంచి వ‌స్తున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News