చీట్ మీల్ తినేవారికి యువ‌హీరో సందేశం

చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఆహార నియ‌మాలు పాటిస్తూ, స‌మ‌యానికి క‌స‌ర‌త్తులు చేస్తూ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా జీవిస్తున్నామ‌ని చెబుతారు.;

Update: 2025-07-24 04:38 GMT

చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఆహార నియ‌మాలు పాటిస్తూ, స‌మ‌యానికి క‌స‌ర‌త్తులు చేస్తూ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా జీవిస్తున్నామ‌ని చెబుతారు. కానీ వాస్త‌వం వేరుగా ఉంటుంది. కొంద‌రు నోరు క‌ట్టేసుకోలేరు. రుచిక‌రంగా ఏదైనా చిక్కితే లొట్ట‌లు వేసుకుని లాగించేస్తుంటారు. అందుకే వీరంతా ఒబేసిటీ కేట‌గిరీ నుంచి బ‌య‌ట‌కు రాలేరు. బాగా బ‌రువు పెరిగి క‌ల‌ర్స్ లో త‌గ్గేందుకు ల‌క్ష‌ల్లో చెల్లించే బాప‌తు గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. స్పా సెంట‌ర్లు లేదా వెయిట్ రిడ‌క్ష‌న్ సెంట‌ర్లు ఇలాంటి వారిపై ప‌డి బ‌తికేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఇక‌పోతే చందు చాంపియ‌న్ సినిమా కోసం బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ మేకోవ‌ర్ చాలా ప్ర‌శంస‌లు అందుకుంది. అత‌డు తీరైన ఆరుప‌ల‌క‌ల దేహంతో టూస్మార్ట్ గా కనిపించాడు. అయితే అప్ప‌ట్లోనే కోల్డ్ ప్లే షో స‌మ‌యంలో ఫిట్ నెస్ ఫ్రీక్ కార్తీక్ చీట్ చేసిన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌ట్లో వైర‌ల్ గా మారిన కార్తీక్ కోల్డ్‌ప్లే కిస్ కామ్ వైరల్ వీడియోను తిరిగి రీక్రియేట్ చేసాడు. కోల్డ్‌ప్లే కచేరీ నుండి ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్ కంపెనీ హెచ్‌.ఆర్ చీఫ్ క్రిస్టిన్ కాబోట్‌తో కలిసి ఉన్న వైరల్ వీడియోను రీక్రియేట్ చేసాడు. ఈ ఇద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నార‌ని ఈ క్లిప్ చెబుతోంది. అదే స‌మ‌యంలో ఫిట్‌నెస్ ఫ్రీక్ కార్తీక్ ఆర్యన్ కోల్డ్‌ప్లే కచేరీలో తన డైట్‌లో మోసం చేస్తూ దొరికిపోయాడు.. అనే టెక్స్ట్‌తో ఒక సరదా వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో అత‌డు ఆద‌మ‌రిచి చాక్లెట్ బార్ తింటున్నాడు. దీంతో తన డైట్ నియ‌మాన్ని ఉల్లంఘించాడు. వెంట‌నే త‌న‌ను ఎవ‌రో గ‌మ‌నిస్తున్నార‌ని తెలుసుకుని నోట్లోంచి ఆ చాక్లెట్ ముక్కను ఉమ్మివేసాడు. కానీ కెమెరాలో చిక్కుకుంటాడు. అతడు ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి డంబెల్స్‌తో తన బైసెప్స్ వ‌ర్క‌వుట్ ని ప్రారంభించ‌డం అంద‌రినీ న‌వ్విస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కార్తీక్ ప్రస్తుతం కరణ్ జోహార్ `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల రాజస్థాన్‌లో జాకీ ష్రాఫ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాడు. సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయిక.

Tags:    

Similar News