ట్రైన్ నుంచి దూకేసిన హీరోయిన్.. ఆందోళనలో అభిమానులు!

తాజాగా తన ఇన్స్టా స్టోరీలో కరిష్మా శర్మ ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. "నేను నిన్న ఒక సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లడానికి చీర కట్టుకున్నాను.;

Update: 2025-09-12 05:13 GMT

సాధారణంగా హీరోయిన్స్ ట్రైన్ నుంచి దూకేయడం.. బస్సు కింద పడడం లాంటి దృశ్యాలను మనం కేవలం సినిమాలలోనే చూస్తాం.. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం రియల్ గానే ట్రైన్ నుంచి దూకేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈమె పరిస్థితి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ట్రైన్ నుంచి దూకేసిన ఆ హీరోయిన్ ఎవరు? ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై కూడా ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ట్రైన్ నుంచి దూకేసిన హీరోయిన్..

ఆమె ఎవరో కాదు కరిష్మా శర్మ.. 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్', ' ప్యార్ కా పంచనామా 2' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. కదులుతున్న రైలు నుంచి కంగారులో కిందకు దూకి గాయపడినట్లు ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిన ఈమె.. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో కంగారులో ఇలా కూడా చేస్తారా అంటూ ఆమెపై కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉండగా.. కాస్త చూసుకోవాలి కదా మేడం జీవితం చాలా చిన్నది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కరిష్మా శర్మ ఎందుకలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.


అసలు విషయం తెలిపిన కరిష్మా శర్మ..

తాజాగా తన ఇన్స్టా స్టోరీలో కరిష్మా శర్మ ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. "నేను నిన్న ఒక సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లడానికి చీర కట్టుకున్నాను. ముంబై లోకల్ ట్రైన్ ఎక్కగానే అది వేగంగా కదిలింది. అయితే నా స్నేహితులు మాత్రం దానిని అందుకోలేక పోయారు. వాళ్ళు రైలు ఎక్కలేదనే టెన్షన్, భయంతో నేను మరే విషయాన్ని ఆలోచించకుండా వెంటనే దూకేశాను. అదృష్టవశాత్తు వెనక్కి తిరిగి పడడంతో వీపు, తలకు దెబ్బలు తగిలాయి. శరీరమంతా చిన్న చిన్న గాయాలయ్యాయి. డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని చెప్పారు. నేను త్వరగా కోలుకోవాలి అంటే మీ అందరి ప్రేమాభిమానాలు నాకు కావాలి" అంటూ అభిమానుల ఆశీస్సులు కావాలి అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే కరిష్మా శర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అటు నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కరిష్మా పరిస్థితిపై ఆమె స్నేహితురాలు ఏమన్నారంటే ?

ఇకపోతే ప్రస్తుత కరిష్మ పరిస్థితిపై ఆమె స్నేహితురాలు మాట్లాడుతూ.." మేము స్టేషన్ లోకి రాగానే అది గమనించకుండా వెంటనే కరిష్మా రైలు నుండి దూకేయడం చూసి మేము ఆశ్చర్యపోయాము. అసలు ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాము. ఆమె రైలు నుంచి పడిపోయింది. మేం వెళ్లి చూసేసరికి తనకి ఏమీ గుర్తులేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాము" అని తన స్నేహితురాలు కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. మొత్తానికైతే ఇప్పుడు వీరిద్దరూ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


కరిష్మా సినిమాలు..

కరిష్మా సినిమాల విషయానికి వస్తే.. కామెడీ సర్కస్ , ది కపిల్ శర్మ షోలలో సందడి చేసిన ఈమె.. సూపర్ 30, ఏక్ విలన్ రిటర్న్స్, హోటల్ మిలన్ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. వెబ్ సిరీస్ లతో పాటు టెలివిజన్ సిరీస్ లలో కూడా నటించింది. అలాగే మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది.

Tags:    

Similar News