45ఏళ్లలో కూడా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటున్న కరీనాకపూర్!

ఈ క్రమంలోనే 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కరీనాకపూర్.;

Update: 2025-09-26 18:30 GMT

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత మరొకరు గ్లామర్ వలకబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అంతేకాదు అత్యధికంగా ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఇంస్టాగ్రామ్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఒకసారి సింపుల్ లుక్ లో కనిపిస్తారు.. మరొకసారి అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలోనే 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కరీనాకపూర్. ఇటీవలే 45వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న ఈమె.. తాజాగా సింపుల్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.

కరీనా కపూర్ ప్రింటెడ్ క్రీం కలర్ చీర ధరించి.. దానికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో తన మేకోవర్ ను ఫినిష్ చేసింది. ముఖ్యంగా జుట్టు అలా లీవ్ చేసి.. సింపుల్ స్మైల్ తో ఫాలోవర్స్ మనసు దోచుకుంది. తాజాగా కరీనాకపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అమ్మడి అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

కరీనాకపూర్ విషయానికి వస్తే రణధీర్ కపూర్, బబితల కుమార్తె. ఈమె సోదరి ఎవరో కాదు కరిష్మా కపూర్. రొమాంటిక్ , కామెడీ మొదలు క్రైమ్ డ్రామా వరకు ఎన్నో సినిమాలు చేసిన ఈమె ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్గా కూడా పేరు దక్కించుకుంది.

కరీనాకపూర్ కెరియర్ విషయానికొస్తే.. 2000 సంవత్సరంలో వచ్చిన రెఫ్యూజీ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక 2001లో చారిత్రాత్మక చిత్రం అశోకాలో కూడా నటించింది. అదే ఏడాది కభీ ఖుషి కభీ గం అనే సినిమా చేసి.. భారీ బ్లాక్ బాస్టర్ ను అందుకుంది. ఆ తర్వాత ఒకేలాంటి పాత్రలు చేయడంతో కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో మళ్లీ యూ టర్న్ తీసుకుని విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించింది.

కరీనా కపూర్ బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. జమ్నాభాయ్ నర్సి స్కూల్లో అలాగే డెహ్రాడూన్ లోని వెల్హం గర్ల్స్ స్కూల్లో చదువుకుంది. అయితే ఈమె తన తల్లిని తృప్తి పరచడానికే స్కూల్ కి వెళ్లే దాన్ని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది కూడా.. గణిత శాస్త్రం తప్ప తనకు అసలు చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండదని, ఒకానొక సమయంలో కరీనా చెప్పుకొచ్చింది. ముంబైలో రెండేళ్లు కామర్స్ చదివిన ఈమె.. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మైక్రో కంప్యూటర్స్ లో మూడు నెలల సమ్మర్ కోర్స్ చేసింది.

తర్వాత న్యాయ శాస్త్ర విద్య వైపు మక్కువ పెంచుకొని.. ముంబై ప్రభుత్వ లా కళాశాలలో చేరింది . అలా నెమ్మదిగా చదువుపై ఇష్టం పెంచుకొని ఒక సంవత్సరం చదివాక.. తనకు ఇష్టమైన నటన వైపు కెరియర్ మలుచుకుంది. ఇక దాంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. నటనలో శిక్షణ తీసుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది కరీనాకపూర్

Tags:    

Similar News