మాలీవుడ్ స్టార్ తో బెబో రొమాన్స్!
దీంతో ఈ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎలా ఉంటాయి? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. పృధ్వీరాజ్ కూడా ఇంత వరకూ బాలీవుడ్ లో సినిమాలు చేయలేదు.;
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పటి వరకూ సౌత్ హీరోల సరసన నటించింది లేదు. కెరీర్ మొత్తం చూస్తే ఆమె నటించింది బాలీవుడ్ హీరోలతోనే. సౌత్ లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా? ఆ ఛాన్స్ తీసుకోలేదు. బాలీవుడ్ కే అంకితమవ్వడంతో? సౌత్ స్టార్లకు ఆమె తో నటించే అవకాశం దక్కలేదు. అయితే తొలిసారి ఓ సౌత్ స్టార్ బెబోతో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడు. అందుకోసం ఆ హీరోనే బాలీవుడ్ కి వెళ్లడం విశేషం. ఇంతకీ ఎవరా హీరో? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మేఘనా గుల్జార్ `దైరా` అనే సినిమాకు సంకల్పించారు.
ఇందులో హీరోగా మాలీవుడ్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ ఎంపికయ్యాడు. క్రైమా డ్రామా నేపథ్యంలో సాగే సినిమాలో పృధ్వీ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్రకు జోడీగా కరీనా కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. వెండి తెరపై ఈ కాంబినేషన్ ఇదే తొలిసారి. అలాగే కరీనాకు ఇది 68వ చిత్రం కావడం విశేషం. కరీనాకు టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చినా? నటించలేదు. బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజా సినిమాలో హ ఇందీలో ఉంటూనే మలయాళం నటుడితో నటించడం ఇదే తొలిసారి.
దీంతో ఈ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎలా ఉంటాయి? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. పృధ్వీరాజ్ కూడా ఇంత వరకూ బాలీవుడ్ లో సినిమాలు చేయలేదు. గతంలో అవకాశాలు వచ్చినా? మాలీవుడ్ కే పరిమితమయ్యారు. కానీ కొంతకాలంగా మాతృభాషతో పాటు, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అక్కడ ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు. ఇటీవలే చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిగా25 ఏల్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ లో అడుగు పెట్టడం విశేషం.
మాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన హీరోలు కూడా పెద్దగా లేరు. చిన్న పరిశ్రమ కావడంతో? చాలా మంది హీరోలు అక్కడికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడా బోర్డర్ దాటొచ్చి మాలీవుడ్ హీరోలంతా ఇతర పరిశ్రమల్లో అవకాశాలు అందుకోవడం విశేషం. అయితే బాలీవుడ్ లో ఇంకా పూర్తి స్థాయిలో మాలీవుడ్ ప్రభావం కనిపించలేదు. అందుకు మరికొంత కాలం సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ వేవ్ టాలీవుడ్ లో అధికంగా కనిపిస్తోంది.