ఆ వ‌యసులోనే క‌రీనా బాత్రూమ్ లో స్టార్ హీరో!

ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ కపిల్ శ‌ర్మ షోలో రివీల్ చేసాడు. క‌పిల్ షోలో ప్ర‌సారం చేయ‌ని ఓ అన్ సీన్ పుటేజీని త‌న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసాడు.;

Update: 2025-06-26 01:45 GMT

స్టార్ హీరోల‌కు లేడీ అభిమానుల ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది. ఇందులో హీరోయిన్లు అతీతం కాదు. వాళ్లు కూడా స్టార్స్ ని అంతే లైక్ చేస్తుంటారు. అభిమాన స్టార్ గా కొలుస్తుంటారు. సినిమాల్లోకి వ‌చ్చి తామెం త పెద్ద స్టార్ అయినా స‌రే అదే అభిమానాన్ని కొన‌సాగిస్తుంటారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ అంటే క‌రీనా క‌పూర్ కి ఎంత‌గా అభిమానిస్తుంది? అన్న‌ది తాజాగా రివీల్ అయింది. క‌రీనా క‌పూర్ చిన్న‌ప్ప‌టి నుంచే స‌ల్మాన్ ఖాన్ వీరాభిమానిగా తేలింది.

అంతే కాదు ఎనిమిదేళ్ల వ‌యసులో త‌న వాష్ రూమ్ ని స‌ల్మాన్ ఖాన్ ఫోటోల‌తో నింపేసిందిట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ కపిల్ శ‌ర్మ షోలో రివీల్ చేసాడు. క‌పిల్ షోలో ప్ర‌సారం చేయ‌ని ఓ అన్ సీన్ పుటేజీని త‌న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసాడు. అందులో రోడ్డు ప‌క్క‌నే క‌ళ్ల జోడు దుకాణంలో మెన్స్ సెలూన్ ను స‌ల్మాన్ ఖాన్ ఎలా వాడేస్తున్నాడు అన్న విష‌యాన్ని పోస్ట‌ర్ లో రివీల్ చేసారు.

ఆ పోస్ట‌ర్ చూసి స‌ల్మాన్ ఖాన్ ఎంత‌గానో న‌వ్వుకున్నాడు. ఈ సంద‌ర్భంగా క‌రీనా క‌పూర్ బాత్ రూమ్ ఫోటోల సంగ‌తి బ‌య‌ట పెట్టాడు. తాను ఓ సారి క‌రీనా ఇంటికెళ్లిన‌ప్పుడు త‌న బాత్ రూమ్ లో ఫోటోలు చూసిన‌ట్టు ..అప్పుడు క‌రీనాకి ఎనిమిదేళ్లు ఉంటాయ‌న్నారు. కానీ క‌రీనాకు 15వ ఏళ్లు వ‌చ్చేస‌రికి స‌ల్మాన్ ఖాన్ ఫోటోలు తీసేసి రాహుల్ రాయ్ ఫోటోలు అంటించుకుంద‌ని స‌ల్మాన్ తెలిపాడు.

స‌ల్మాన్-క‌రీనా బాలీవుడ్ లో మంచి స్నేహితులు. ఇద్ద‌రు జంట‌గా బాడీగార్డ్, క్యూంకీ, బ‌జ్ రంగ్ భాయిజాన్ లాంటి చిత్రాల్లో న‌టించారు. మూడు సినిమాలు మంచి విజ‌యం సాధించిన‌వే. మ‌ళ్లీ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News