పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన టైమొచ్చింది
ఒక సినిమా సక్సెస్ అయితే అదే తరహా సినిమాలను తీస్తే అవి హిట్ అవుతాయని చెప్పలేం.;
ఏదీ ఎప్పుడూ ఎవరూ ఊహించినట్టు జరగదు. అలా జరిగితే మనం కూడా దేవుళ్లమే అయిపోతాం. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక్కోసారి ఎన్నో అంచనాలతో వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే, మరికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా సాధిస్తుంటాయి.
మిరాయ్ ను హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్
ఒక సినిమా సక్సెస్ అయితే అదే తరహా సినిమాలను తీస్తే అవి హిట్ అవుతాయని చెప్పలేం. అందుకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలంటున్నారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాను కరణ్ జోహార్ హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సినిమా రిజల్ట్ ముందే రాసిపెట్టి ఉంటుంది
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కరణ్ కు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లావ్ అవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురైంది. దానికి కరణ్ సమాధానమిస్తూ ప్రతీ సినిమా రిజల్ట్ ముందే డిసైడై ఉంటుందని, పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టైన సందర్భాలున్నాయనీ, కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారాయని, వాటికి తగ్గట్టు మనం కూడా మారి సిట్యుయేషన్స్ ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అన్నీ సినిమాలూ సైయారా, మహావతార్ కాలేవు
కాబట్టి సినిమా ఫెయిల్యూర్ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేమని, కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు కూడా సక్సెస్ అయ్యాయని, అలానే ఫెయిలైన సందర్భాలు కూడా ఉన్నాయని, ఎప్పుడేం జరుగుతుందనేది ఎవరూ కచ్ఛితంగా చెప్పలేమని చెప్పిన కరణ్ జోహార్, మ్యూజిక్ ను బేస్ చేసుకుని వచ్చిన ప్రతీ సినిమా సైయారాలాగా ఆడదని, యానిమేషన్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలన్నీ మహావతార్ నరసింహ కాలేవని, ఇంకా చెప్పాలంటే వాటి దరిదాపుల్లోకి కూడా రాలేవని కరణ్ అన్నారు.