రవివర్మ చిత్రలేఖన స్ఫూర్తితో ఆ డిజైన్!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా వేదికపై బాలీవుడ్ దర్శక, నిర్మాత దిగ్గజం కరణ్ జోహార్ సందడి చేసిన సంగతి తెలిసిందే.;
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా వేదికపై బాలీవుడ్ దర్శక, నిర్మాత దిగ్గజం కరణ్ జోహార్ సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ పండగలో కరణ్ విలక్షణమైన దుస్తులతో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. భారతీయ సంస్కృతిని ఆధునిక ఫ్యాషన్‌తో మేళవించి డిజైనర్ లో తళుక్కున మెరిశారు. ఈ స్పెషల్ అవుట్‌ఫిట్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఈ దుస్తుల వెనుక ఉన్న ప్రధాన స్ఫూర్తి భారతీయ దిగ్గజ చిత్రకారుడు రాజా రవివర్మ కళాఖండాలు కావడం గమనార్హం.
రవివర్మ చిత్రాల్లో కనిపించే రాజసం, రంగుల కలయిక , కళాత్మకత ఉట్టిపడేలా మనీష్ డ్రెస్‌ను డిజైన్ చేశారు. పాశ్చాత్య వేదికపై దేశపు ఘనమైన కళా వారసత్వాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఈ థీమ్‌ను ఎంచుకు న్నట్లు తెలుస్తోంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఎంబ్రాయిడరీ - డిజైన్ వివరాలు అత్యంత సున్నితంగా విలాసవంతంగా ఉన్నాయి. కరణ్ జోహార్ వ్యక్తిత్వానికి మెట్ గాలా గ్రాండ్‌నెస్‌కు తగినట్లుగా మనీష్ మల్హోత్రా దీన్నీ తీర్చిదిద్దారు. దుస్తులే కాక ఆయన ధరించిన యాక్సెసరీస్ కూడా రవివర్మ పెయింటింగ్స్‌లోని అలంకరణలను మరిపిస్తున్నాయి.
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారుడికి ఇంతటి ఆదరణ పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి . కరణ్ జోహార్ తొలిసారి మెట్ గాలాలో పాల్గొన్నా? తనదైన కాన్ఫిడెన్స్‌తో రెడ్ కార్పెట్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. సాధారణంగా ఈ వేదికపై హాలీవుడ్ స్టార్ల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తొలిసారి భారతీయ దర్శకుడు ఫ్యాషన్ సెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం. కరణ్ ఫ్యాషన్ పట్ల మక్కువ చూపిస్తుంటారు. తొలిసారి ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం రావడంతో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
ఈవెంట్ తర్వాత కరణ్ జోహార్ - మనీష్ మల్హోత్రా సోషల్ మీడియాలో అనుభవాలను పంచుకున్నారు. భారతీయ హస్తకళల గొప్పతనాన్ని -రాజా రవివర్మ కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం గర్వంగా ఉందని పేర్కొ న్నారు. భారతీయ ఫ్యాషన్ ప్రపంచం దేశానికే పరిమితం కాకుండా? అంతర్జాతీయ స్థాయిలో కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేస్తోందని ఈ పరిణామం నిరూపిస్తోంది. మెట్ గాలా ఎంట్రీ కరణ్ కు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దేశపు పురాతన చిత్రకళా సౌందర్యాన్ని ఆధునిక కాలపు ఫ్యాషన్‌లోకి అనువదించిన తీరు నిజంగా అద్భుతం. రాజా రవివర్మ కళకు, మనీష్ మల్హోత్రా సృజనాత్మకతకు కరణ్ జోహార్ స్టైల్‌కు దక్కిన గొప్ప గౌరవంగా చూడొచ్చు. ఇకపై భవిష్యత్తులో మరిన్ని భారతీయ థీమ్స్ ఇలాంటి గ్లోబల్ వేదికలపై కనిపిస్తాయని ఆశీంచొచ్చు.