ఇట్స్ పార్టీ టైమ్: రాణీ జీ బుగ్గపై కరణ్ పెక్
సోషల్ మీడియాలలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో కరణ్ ప్రముఖ కథానాయిక రాణీ ముఖర్జీ బుగ్గపై పెక్ ఇస్తూ కనిపించాడు.;
షారూఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు నేడు అంగరంగ వైభవంగా సాగాయి. అతడు తన సన్నిహితులు , కుటుంబ సభ్యులతో అలీబాగ్‌లోని తన నివాసంలో ఈ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పార్టీలో అతడి ప్రాణ స్నేహితుడు, దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా నిలిచాడు. సోషల్ మీడియాలలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో కరణ్ ప్రముఖ కథానాయిక రాణీ ముఖర్జీ బుగ్గపై పెక్ ఇస్తూ కనిపించాడు.
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకలో రాణి ముఖర్జీతో తీసుకున్న సెల్ఫీని కరణ్ స్వయంగా షేర్ చేసాడు. తెల్లటి దుస్తులు ధరించి కెమెరాకు పోజు ఇస్తూ రాణీజీపై ప్రేమను కురిపిస్తూ, ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఫోటోలో షారుఖ్ లేకపోయినా, అది సరదా వేడుకగా కనిపించింది.
అనన్య పాండే ఈ పార్టీలో అద్భుతమైన డ్యాన్స్ చేస్తూ కనిపించింది. చేతిలో డ్రింక్ పట్టుకుని తన నృత్యవిన్యాసాలను ప్రదర్శించింది. హాల్టర్-నెక్ గోల్డ్ డ్రెస్ లో సన్నజాజి తీగలా అద్భుతంగా కనిపించింది.
అనన్యను చూపిస్తూ, ఈ బాంబర్‌ను ఊహించాలా? అంటూ కరణ్ టీజ్ చేసాడు. అనన్యతో పాటు చాలా మంది కథానాయికలు షారుఖ్ పార్టీలో నృత్యం చేస్తూ ఆనందించారు. ఇక ఖాన్ సన్నిహితురాలు, ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ అతడిని కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్న ఫోటోగ్రాఫ్ వైరల్ అయింది. ప్రతి సంవత్సరం షారుఖ్ తన పుట్టినరోజున మన్నత్ నుండి తన అభిమానులను పలకరించేవాడు. కానీ ఈసారి పార్టీ అలీభాగ్ కి మారడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. ప్రస్తుతం ఈ పార్టీకి చెందిన చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
షారుఖ్ తదుపరి సిద్ధార్థ్ ఆనంద్ `కింగ్`లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లవత్, సౌరభ్ శుక్లా తదితరులు నటించారు. ఈరోజు విడుదల చేసిన కింగ్ టీజర్ లో షారూఖ్ పెప్పీ లుక్ అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే సుహానా ఖాన్ లుక్ కూడా విడుదలవుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. 2026లో కింగ్ థియేటర్లలోకి వస్తాడు.