అప్పుడు మూవీ క్యాన్సిల్.. ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు...
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్, నటుడు కార్తిక్ ఆర్యన్ మధ్య వివాదం నెలకొన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.;
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్, నటుడు కార్తిక్ ఆర్యన్ మధ్య వివాదం నెలకొన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే 2021లో దోస్తానా 2 మూవీని కార్తిక్ తో కరణ్ అనౌన్స్ చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత సినిమాను ఆపివేశారు.
అందుకు కారణాలు తెలియకపోయినా.. సినిమా మాత్రం ఆగిపోయింది. కరణ్, కార్తిక్ మధ్య డిఫరెన్సెస్ రావడం వల్లే మూవీ ఆగిందని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జాన్వీ కూడా ఓ ఇంటర్వ్యూలో 30-35 రోజుల పాటు షూట్ చేశామని, అనంతరం సినిమా రద్దు అయిందని తెలిపారు.
దీంతో కరణ్, కార్తిక్ మధ్య అప్పటి నుంచి వివాదం కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ వాటికి చెక్ పెడుతూ కొన్ని నెలల క్రితం జరిగిన ఐఫా అవార్డుల వేడుకకు ఇద్దరూ హోస్టులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలు కలిసి చేస్తున్నారు. దీంతో ఏంటీ సడెన్ ఛేంజ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
గత ఏడాది క్రిస్మస్ స్పెషల్ గా తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాను కార్తిక్ తో కరణ్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఆ మూవీ సెట్స్ పై ఉండగానే.. నాగ్ జిల్లా పేరుతో మరో ప్రాజెక్ట్ ను రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా మేకర్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. సినిమాలో కార్తిక్ ఆర్యన్ 631 ఏళ్ల సర్పంగా కనిపించనున్నాడని అర్థమవుతోంది. మోషన్ పోస్టర్ లో కార్తిక్ బ్లూ జీన్స్ లో వీపును చూపిస్తూ ఓ పాముల గుహలో నిల్చుని ఉండి దూరంగా ఉన్న నగరం వైపు చూస్తున్నారు. అందులో కార్తీక్ చర్మం క్రమంగా ఆకుపచ్చగా, పొలుసులుగా మారుతూ ఆసక్తికరంగా అనిపించింది.
ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒకప్పుడు సినిమా రద్దు అయిన పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్న పరిస్థితికి మారారు కరణ్, కార్తిక్. ఏదేమైనా ఇండస్ట్రీలో ఇలాంటి ఫ్రెండ్ షిప్ ఉండాలనే అందరూ కోరుకుంటారు. మరి ఆ రెండు చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.