క్రికెటర్లను పిలవాలంటే ఇప్పుడాయనకు భయం!
కె.ఎల్ రాహుల్, ఆర్దిక్ పాండ్య ఘటన తర్వాత `కాఫీ విత్ కరణ్ టాక్` షోపై ఎలాంటి విమర్శలు వెల్లువెత్తాయో తెలిసిందే.;
కె.ఎల్ రాహుల్, ఆర్దిక్ పాండ్య ఘటన తర్వాత `కాఫీ విత్ కరణ్ టాక్` షోపై ఎలాంటి విమర్శలు వెల్లువెత్తాయో తెలిసిందే. మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆ ముగ్గురిపై దేశమే దుమ్మెత్తి పోసింది. బీసీసీఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు ప్లేయర్లపై 20 లక్షలు జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా వీరిని భారత జట్టు నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ ఇద్దరి క్రికెటర్లపై ఈ ఘటన అన్నది మాయని మచ్చలా మారింది. ఒక్కసారి నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం అన్నది ఎంత కష్టమన్నది అర్దమైంది. ఇప్పటికే ఆ ఇద్దరు క్రికెటర్లు ఎంతో మధన పడుతున్నారు.
స్కూల్ డేస్ లో కూడా ఎప్పుడూ సస్పెండ్ కాని వారు ఏకంగా జట్టు నుంచే ఎదురు దెబ్బ తగలడంతో? ఎలా ఎదుర్కోవాలో తెలియదు..జనాలకు ముఖం చూపించలేక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటన తర్వాత కరణ్ జోహార్ లో కూడా కొంత పరివర్తన కనిపించింది. ప్రశ్నలు అడిగే విధానంలో చిన్నపాటి మార్పులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ లను కూడా కరణ్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అమీర్ ఖాన్ చాచి లెంపకాయ కొట్టినట్లు సమాధానం ఇచ్చారు. మహిళల పట్ట ఎలా ఉండాలో? చిన్న పాటి క్లాస్ పీకాడు.
ఈ రెండు ఘటనల తర్వాత కరణ్ లో చాలా మార్పులొచ్చాయి. అయితే ఈ షోకు ఇంత వరకూ భారత్ సంచలనం విరాట్ కోహ్లీ మాత్రం హాజరు కాలేదు. ఇదే ప్రశ్నకరణ్ ముందుకు తీసుకెళ్తే ఆయన ఏమని బధులిచ్చారంటే? ఆ పాత సంఘటన కారణంగానే క్రికెటర్లను మళ్లీ తన షోకు పిలవలేదన్నాడు. సానియా మీర్జా నిర్వహిస్తోన్న‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ అనే పోడ్‌కాస్ట్‌లో కరణ్ అలా ఓపెన్ అయ్యారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యలపై నెటి జనులు రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
కరణ్ ఇప్పుడు క్రికెటర్లను పిలవాలంటే భయపడుతున్నట్లున్నాడు? ఆ భయం నుంచి వచ్చిన పరివర్తనే ఇదంటూ ఓ యూజర్ పోస్ట్ చేసాడు. అలాగే మీ షోకు హాజరు కాని నటుడు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవ్వగా దానికి బధులిస్తూ రణబీర్ కపూర్ పేరు చెప్పాడు. గత మూడు సీజన్ల నుంచి కరణ్ రావడం లేదని తెలిపాడు. రణబీర్ ని కూడా ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడనే హాజరవ్వడం మానేసాడా? అంటూ మరో యూజర్ పోస్ట్ పెట్టాడు.