• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  500 జీతంతో మొద‌లై...

500 జీతంతో మొద‌లై 300కోట్లకు ఎదిగిన న‌టుడు

| అద్దె ఇంట్లో ఇరుకు గ‌దిలో జీవితం.. తండ్రికి క్యాన్సర్.. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే 500 జీతం. ఇలా మొద‌లైన ఒక యువ‌కుడు ఈరోజు బుల్లితెర‌ను ఏల్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-07-19 03:15 GMT

అద్దె ఇంట్లో ఇరుకు గ‌దిలో జీవితం.. తండ్రికి క్యాన్సర్.. ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే 500 జీతం. ఇలా మొద‌లైన ఒక యువ‌కుడు ఈరోజు బుల్లితెర‌ను ఏల్తున్నాడు. అత‌డు నెల‌కు 3 కోట్లు.. ఏడాదికి 35 కోట్లు సంపాదిస్తాడు. 2025 నాటికి దాదాపు 250-300 కోట్ల నిక‌ర‌ ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టాడు. భార‌త‌దేశంలోని అత్యంత ధ‌నిక క‌మెడియ‌న్ల‌లో ఒక‌రిగా స్థానం సంపాదించారు. బ్ర‌హ్మానందం, వ‌డివేలు, జానీ లీవ‌ర్ (బాలీవుడ్) వంటి ప్ర‌ముఖుల జాబితాలో చేరాడు. ఇంత‌కీ ఎవ‌రా క‌మెడియ‌న్ అంటే? హిందీ బుల్లితెర హోస్ట్ కం న‌టుడు క‌పిల్ శ‌ర్మ. అత‌డి వార్షిక ఆదాయం, ఆదాయ అభివృద్ది అసాధార‌ణం.

క‌పిల్ ఒక సాధార‌ణ యువ‌కుడిలాగా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ‌ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు. 300-500 మ‌ధ్య‌ జీతంతో అత‌డి జీవితం మొద‌లైంది. కానీ ఈరోజు 300 కోట్ల నిక‌ర ఆస్తిని ఆర్జించాడు. `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2`తో కామెడీ కింగ్ గా కపిల్ శర్మ హృదయాలను గెలుచుకుంటున్నాడు. అత‌డు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగాడు. అతని తండ్రి జితేంద్ర కుమార్ ఒక హెడ్ కానిస్టేబుల్. అతని తల్లి జాంకీ రాణి గృహిణి. కపిల్‌కు ఒక అన్న, ఒక సోదరి కూడా ఉన్నారు. క‌పిల్ చురుకైన‌వాడు. అతను మొదట్లో కమర్షియల్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ విద్య‌ను అభ్యసించినా కానీ జీవితం వేరే మలుపు తిరిగింది. అతడు కళాశాల విద్యార్థులకు థియేటర్ స్ట‌డీస్ ను నేర్పించడం ప్రారంభించాడు. కపిల్ తండ్రి 22 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించాడు. ఆ సంవత్సరం కపిల్, అతడి కుటుంబం కష్టాలతో క‌ల‌త‌కు గురైంది. వారు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. తండ్రి మరణానంతరం కపిల్‌కు పోలీస్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినా అందుకు నిరాకరించాడు. చిన్నప్పటి నుంచి కపిల్‌కి సింగర్‌ కావాలనే కోరిక ఉండేది. అయినా కానీ అతడు తరువాత నాటకరంగంలో చేరాడు. వివిధ ప్రదేశాలలో నాటకాలను ప్రదర్శించాడు.

క‌పిల్ చిన్న వయసులో పీసీఓ బూత్‌లో పనిచేసి రూ.500 సంపాదించాడు. తన 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత అతడు టెక్స్‌టైల్ మిల్లులో ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతను నెలకు రూ.900 సంపాదించాడు. పని చేయమని అతని కుటుంబం అతడిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు కాబట్టి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని మ్యూజిక్ సిస్టమ్స్ కొనడానికి ఉపయోగించాడు. తన గ్రాడ్యుయేషన్ సమయంలో కపిల్ తన జేబులో కేవలం రూ. 1,200తో ఉద్యోగం కోసం సెలవుల్లో ముంబైకి వెళ్లాడు. అయితే అతడు ఏమీ లేకుండానే వెన‌క్కి వ‌చ్చాడు.

ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ - టీవీ షో కీల‌క మ‌లుపు. ఈ షోతో అతడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. 3వ సీజన్‌లో అతడు విజేతగా నిలిచాడు. 10 లక్షల ప్రైజ్ మనీతో తన సోదరి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత కపిల్ వెనుదిరిగి చూడలేదు. విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. 2024 నాటికి కపిల్ తన స్వంత కామెడీ షోను ప్రారంభించాడు. ఒక ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు సంపాదిస్తాడు. కొన్నేళ్లుగా కపిల్ అసాధార‌ణంగా ఆర్జించాడు. అతడి మొత్తం ఆస్తులు రూ. 300 కోట్లు. కపిల్ కృషి, విజయం అతడికి ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించిపెట్టాయి. 2019లో ఫోర్బ్స్ జాబితాలో 53వ స్థానాన్ని పొందాడు. కపిల్ శర్మ రూ.280 కోట్లతో పరిశ్రమలోని అత్యంత సంపన్న హాస్యనటులలో ఒకరిగా ఎదిగాడ‌ని ఫోర్బ్స్ పేర్కొంది.

పంజాబ్‌లోని ఫామ్‌హౌస్‌ సహా ముంబైలో అత‌డికి భారీ ఆస్తులున్నాయి. రూ. 1.25 కోట్ల విలువైన వోల్వో ఎక్స్‌సి90 , రూ. 1.2 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్350 సిడిఐ వంటి కార్లు ఉన్నాయి. 2013లో రూ.60 లక్షలకు రేంజ్ రోవర్ ఎవోక్‌ను కొనుగోలు చేశాడు. అలాగే రియ‌ల్ ఎస్టేట్ లోను భారీ పెట్టుబ‌డులు పెట్టాడు.

Tags:    
  • KapilSharma 
  • RagsToRiches 
  • IndianComedyKing 
  • KapilSharmaShow 
  • SuccessStory 
  • KapilSharmaAssets 
  • KapilSharmaWealth 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS