హన్సిక సర్ ప్రైజ్.. ఏంటీ కపాలి కథ?

నారా రోహత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కపాలి టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

Update: 2026-08-10 05:44 GMT

నారా రోహత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కపాలి టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ ఒక డిఫరెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ గన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా హన్సిక మోత్వాని నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసిన వెంటనే అందరిలోనూ సినిమాపై ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.




 


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ చాలా క్రియేటివ్ గా, డిఫరెంట్ గా డిజైన్ చేశారు. హన్సిక ఫేస్ ను ఒక బ్లాక్ అండ్ వైట్ హ్యాండ్ స్కెచ్ లాగా చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో ఆమె ఎక్స్ ప్రెషన్ చాలా ఇంటెన్స్ గా, ఎంతో సీరియస్ గా ఉంది. అలాగే ఆమె చూపులు ఏదో తెలియని ఒక మిస్టరీని దాచిపెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. చాలా సింపుల్ డ్రెస్ వేసుకుని, మెడలో ఒక చిన్న చైన్ తో ఉన్న హన్సిక ప్రెజెంటేషన్ చూస్తుంటే ఈ సైకలాజికల్ కథలో ఆమె క్యారెక్టర్ బలంగా ఉండబోతోందని తెలుస్తోంది.

హన్సిక ఫేస్ మాత్రమే కాకుండా ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో దాగి ఉన్న ఎలిమెంట్స్ కూడా సినిమా కథపై ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పోస్టర్ చుట్టూ ప్రాచీన కాలం నాటి కొన్ని వింతైన గుర్తులు, సింబల్స్ కనిపిస్తున్నాయి. చీకటి అడవిలో భారీ చెట్ల మధ్య నుంచి సూర్యరశ్మి వెలుగు పడుతున్నట్లుగా డిజైన్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఆ అడవి మధ్యలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి నీడ సస్పెన్స్ ను అమాంతం పెంచేస్తోంది.

రొటీన్ దెయ్యాల కాన్సెప్ట్ తో కాకుండా అంతుచిక్కని చీకటి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఏదో కనపడని శక్తులతో పోరాడే ఒక డార్క్ సైకలాజికల్ గేమ్ లాగా ఈ కథ సాగనుందని తెలుస్తోంది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే పోస్టర్ లో ఉన్న వింత గుర్తులు అన్నీ కూడా ఈ హారర్ థ్రిల్లర్ కు పక్కాగా సెట్ అయ్యేలా చూసుకున్నారు. ఇలాంటి డిఫరెంట్ నేపథ్యం ఉన్న జానర్ లో హన్సిక యాక్ట్ చేస్తుండటంతో ఆమె రోల్ ఎలా ఉండబోతుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజీ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ను సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్ పై చాలా గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. మేకింగ్ విషయంలో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, విజువల్ గా ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఈ అంచనాల స్థాయిని ఇంకా ఎంత పెంచుతాయో చూడాలి.

Tags:    

Similar News