కాంతార ప్రీక్వెల్.. క్రేజీ లిస్ట్ లో ఏ ప్లేస్ సాధించిందంటే?
మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 తెరకెక్కిన విషయం తెలిసిందే.;
మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 తెరకెక్కిన విషయం తెలిసిందే. కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు.
మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన కాంతార ప్రీక్వెల్.. వాటిని అందుకుని దూసుకుపోతోంది. ప్రీమియర్స్ షో నుంచి పాజిటివ్ టాక్ రాగా.. ఫస్ట్ రోజు నుంచి కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా.. సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.750 కోట్లకుపైగా వసూలు చేసింది కాంతార చాప్టర్ 1.
తద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ (అన్ని భాషలు) జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఆ క్రేజీ లిస్ట్ లో 15వ స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన చావా మూవీ తర్వాత స్థానంలో ఉంది. మరి ఆ జాబితాలో ఏ సినిమాలు ఉన్నాయంటే?
1. పీకే (2014)
2. భజరంగీ భాయిజాన్ (2015)
3. దంగల్ (2016)
4. బాహుబలి-2 (2017)
5. సీక్రెట్ సూపర్ స్టార్ (2017)
6. ఆర్ఆర్ఆర్ (2022)
7. కేజీఎఫ్ (2022)
8. పఠాన్ (2023)
9. జవాన్ (2023)
10. యానిమల్ (2023)
11. కల్కి 2898 ఏడీ (2024)
12. స్త్రీ 2 (2024)
13. పుష్ప 2(2024)
14. చావా (2025)
15. కాంతార చాప్టర్ (2025)
ఇక కాంతార చాప్టర్ విషయానికొస్తే.. ఇప్పుడు రూ.800 కోట్ల మార్క్ ను టచ్ చేసే దిశగా వెళుతోంది. అయితే భారతీయ భాషల్లో మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్లు అందుకుంటున్న సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ను మేకర్స్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31వ తేదీన విడుదల చేస్తున్నారు. తద్వారా ఇంగ్లీష్ లో డబ్ అయిన తొలి ఇండియన్ మూవీగా కాంతార ప్రీక్వెల్ నిలిచింది.
సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ నటించారు. గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, ప్రకాష్ తమినాడు, జయరామ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.