కాంతారా ప్రీక్వెల్.. ఏదో మిస్ అవుతుందే..?

3 ఏళ్ల క్రితం రిషబ్ శెట్టి కాంతార సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తను నటించడమే కాదు ఆ సినిమాను డైరెక్ట్ చేసి షాక్ ఇచ్చాడు.;

Update: 2025-07-20 23:30 GMT

3 ఏళ్ల క్రితం రిషబ్ శెట్టి కాంతార సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తను నటించడమే కాదు ఆ సినిమాను డైరెక్ట్ చేసి షాక్ ఇచ్చాడు. హోంబలే ప్రొడక్షన్ లో 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఐతే కాంతార క్రేజ్ తో కాంతారా ప్రీక్వెల్ అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఐతే అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. కాంతారా ప్రీక్వెల్ కథ ఏంటి.. రిషబ్ ఈసారి ఎలా సర్ ప్రైజ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా ఉన్నా కాంతార ప్రీక్వెల్ మీద బజ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు ఈ సీక్వెల్ నుంచి వచ్చిన ఒక టీజర్ ఓకే అనిపించేసింది. రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ ని చాలా సీక్రెట్ గా చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని మీడియాకు లీక్ కాకుండా చేస్తున్నారు.

ఐతే కాంతార ప్రీక్వెల్ మీద ఉన్న అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదో మొదటి సినిమా హిట్ అయ్యింది కదా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే పొరపడినట్టే. మరి రిషబ్ ఈ విషంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది. కాంతార 2 అదే కాంతారా ప్రీక్వెల్ ను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 150 కోట్ల పైన ఉండగా రెమ్యునరేషన్ లు మిగతా ఖర్చులు మరో 100 కోట్లు అవుతున్నాయట. సో కాంతారా బ్లాక్ బస్టర్ కాబట్టి నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తున్నారు. కాంతారా పూర్తి బాధ్యత అంతా కూడా రిషబ్ శెట్టి మీద ఆధారపడి ఉంది. ప్రీక్వెల్ కూడా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం కాంతార 2 చేసే రికార్డులకు బాక్సాఫీస్ షేక్ అవుతుందని చెప్పొచ్చు. రిషబ్ శెట్టి కూడా ఆడియన్స్ ప్రీక్వెల్ పై ఉన్న అంచనాల మీద గురి పెట్టాడు. కాంతారా ప్రీక్వెల్ కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News