కాంతార-1.. ఇండస్ట్రీలోనే తొలిసారి ఇలా..

ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్‌-1 రూపొందిస్తున్నారు.;

Update: 2025-09-14 05:30 GMT

కన్నడ సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో కాంతార మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.15 కోట్లతో నిర్మించిన ఆ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టేసింది.

ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్‌-1 రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల చేయనుండగా.. మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.

అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో వేరే లెవెల్ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ తో సినీ ప్రియుల్లో ఉన్న అంచనాలకు ఇంకా పెంచాలని మేకర్స్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్లాన్లు కూడా వేస్తున్నారు.

ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో తొలిసారి ప్రీమియర్స్ వేయాలని కాంతార ప్రీక్వెల్ మేకర్స్ యోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 1వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీమియర్స్.. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు వేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఇప్పటికే అనేక కన్నడ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ, ముందు రోజు ప్రత్యేక ప్రీమియర్లను ఎప్పుడూ వేయలేదు. కానీ తెలుగు, తమిళ చిత్రాల విజయం చూసి, కాంతార నిర్మాతలు ప్రత్యేక షోలను ప్లాన్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.

కాగా, మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ తో అంచనాలు పెరిగితే ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ వస్తే తిరుగులేనట్లే. అప్పుడు స్పెషల్ షోలు.. సినిమాకు హెల్ప్ అవుతాయి. మరి కాంతారతో శాండల్ వుడ్ లో ప్రీమియర్స్ ట్రెండ్ స్టార్ట్ అవ్వనుండగా.. మిగతా మేకర్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్సులు ఎక్కువే ఉన్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News