మొద‌టి పార్ట్ తో ఎలాంటి సంబంధ‌ముండ‌ద‌ట‌!

కాంతార సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ప్రీక్వెల్ కు దాన్ని మించి రిలీజ్ ఉండేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-09-11 13:30 GMT

2022లో చిన్న సినిమాగా వ‌చ్చి సెన్సేష‌న్ సృష్టించిన కాంతార సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. డివోష‌న‌ల్ పీరియాడిక్ డ్రామా గా వ‌చ్చిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా న‌టించ‌గా, ఇప్పుడా సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్ట‌ర్1 వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. కాంతార సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఈ ప్రీక్వెల్ రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది.

కాంతార చాప్ట‌ర్1 కు భారీ బిజినెస్

ఆల్రెడీ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జ‌ర‌గ్గా, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడుపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. దాదాపు రూ.125 కోట్ల మేర ఈ డీల్ జ‌రిగిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా సుమారు రూ.100 కోట్ల మేర జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

అక్టోబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్

కాంతార సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ప్రీక్వెల్ కు దాన్ని మించి రిలీజ్ ఉండేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిష‌బ్ శెట్టి స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాంతార చాప్ట‌ర్1 సినిమా ప్ర‌మోష‌న్స్ ను కూడా చిత్ర యూనిట్ భారీగానే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కాంతార ఫ్రాంచైజ్ లో మూడో పార్ట్ కూడా?

ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం కాంతార చాప్ట‌ర్1 ట్రైల‌ర్ క‌ట్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. కాంతార సినిమాకీ, ఈ ప్రీక్వెల్ కు ఎలాంటి సంబంధం లేకుండా విభిన్నంగా ఈ సినిమా ఉంటుంద‌ని, కాంతార చాప్ట‌ర్1 పూర్తిగా కొత్త క‌థ అని శాండిల్‌వుడ్ మీడియా వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్ నిర్మించిన ఈ సినిమాకు అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ కూడా రానుంద‌ని టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News