హోంబలే బ్యానర్ వారి హెచ్చరిక..!

డివైనిటీ పేరుతో మీరు సినిమాలు చేస్తే లేదు కానీ అది నచ్చి మేము అలా వేషధారణ చేస్తే తప్పా అన్న కామెంట్స్ రావొచ్చు.;

Update: 2025-10-07 06:45 GMT

సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో హోంబలే బ్యానర్ చేస్తున్న హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ బ్యానర్ నుంచి కె.జి.ఎఫ్ 1 అండ్ 2 వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకోగా నెక్స్ట్ సలార్ 1 కూడా సత్తా చాటింది. ఐతే ఆ సినిమాలకు భిన్నంగా మహావతార్ నరసిం హా అంటూ ఒక యానిమేటెడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హోంబలే బ్యానర్ సినిమా అంటే చాలు అది పక్కా సూపర్ హిట్ అనే రేంజ్ కి బ్యానర్ క్రెడిబిలిటీ సాధించింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 కూడా ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

 

ఆడియన్స్ లో డివైనిటీ ఎక్స్ పీరియన్స్..

మహావతార్ నరసింహ తోనే ఆడియన్స్ లో డివైనిటీ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన హోంబలే మూవీస్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 తో తుళునాడులో జరిగే ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పారు. ఐతే ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ లో కొందరు ఆ భూతకోల వేషాలను థియేటర్లలో, పబ్లిక్ లో చేస్తున్నారు. ఐతే ఈ విషయం గుర్తించిన హోంబలే బ్యానర్ అలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ ఆ అనౌన్స్ మెంట్ చేసిన కొద్ది నిమిషాలకే మళ్లీ దాన్ని డిలీట్ చేశారు. హోంబలే బ్యానర్ నుంచి వచ్చిన ఈ హెచ్చరికను ప్రేక్షకులు రెండు రకాలుగా తీసుకునే ఛాన్స్ ఉంది. డివైనిటీ పేరుతో మీరు సినిమాలు చేస్తే లేదు కానీ అది నచ్చి మేము అలా వేషధారణ చేస్తే తప్పా అన్న కామెంట్స్ రావొచ్చు. మరోపక్క సినిమాలో చూపించినట్టుగా వేషధారణ చేసి ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచనతో హెచ్చరించి ఉండొచ్చు.

హోంబలే బ్యానర్ వార్నింగ్..

ఐతే సోషల్ మీడియాలో ఈ వార్నింగ్ ఎనౌన్స్ మెంట్ చేసి మళ్లీ అది డిలీట్ చేసే సరికి అందరికీ డౌట్ మొదలైంది. ఐతే హోంబలే రిలీజ్ చేసిన నోట్ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హోంబలే వారి హెచ్చరిక నిజమైనదే కానీ సినిమా నచ్చితే ఆడియన్ ఆ సినిమాలో వేషధారణ తనకు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. అది స్పూర్తిగా తీసుకోవచ్చు కానీ దాన్ని అపహాస్యం చేస్తే నిర్మాణ సంస్థ కాదు అతని చుట్టుపక్కన ఉన్నవాళ్లే వాళ్లకు సరైన సమాధానం చెబుతారు.

ఏది ఏమైనా బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాంతారా 1 గురించి అందులోని దేవుళ్ల గురించి ఒక అనౌన్స్ మెంట్ రావడం.. మళ్లీ దాన్ని డిలీట్ చేయడం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది.

Tags:    

Similar News