రజనీ, ఎన్టీఆర్ ఫెయిల్- మరి రిషభ్ ఆ టార్గెట్ అందుకుంటాడా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 2, దంగల్ వంటి చిత్రాలు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించగలవని నిరూపించాయి. ఆ తర్వాత అనేక భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈ మార్క్ అందుకొని ఎలైట్ లిస్ట్ లో చేరాయి.;

Update: 2025-08-23 08:39 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి 2, దంగల్ వంటి చిత్రాలు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించగలవని నిరూపించాయి. ఆ తర్వాత అనేక భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఈ మార్క్ అందుకొని ఎలైట్ లిస్ట్ లో చేరాయి. గత మూడు సంవత్సరాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, షారుక్ ఖాన్ పఠాన్, జవాన్, బన్నీ పుష్ప 2, కల్కి 2898AD వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి.

దీంతో ఇండస్ట్రీలో రూ.1000 కోట్లు అనేది ట్రేడ్ మార్క్ అయ్యింది. 2025లో అనేక భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు చేరుతాయని అంచనా వేశారు. బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్ నుంచి ఈ సంవత్సరం రూ.1000 కోట్ల క్లబ్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేరుతుందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది ప్రారంభమై.. 8 నెలలు గడుస్తున్నా ఆయా ఇండస్ట్రీల నుంచి ఒక్క సినిమా కూడా ఈ లిస్ట్ లో చేరలేకపోయాయి.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఛావా మంచి విజయం అందుకున్నా.. అది రూ. 800 కోట్లకు దగ్గరగా వసూళ్లు చేయగలిగింది. ఇటీవల వచ్చిన వార్ 2, కూలీ వంటి సినిమాలు స్టార్ హీరోల కారణంగా రూ. 1000 క్లబ్‌ లో చోటు దక్కించుకుంటాయని ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. 1000 కాదు 500 కోట్లు కూడా అందుకోలేదు.

దీంతో ఇప్పుడు రాబోయే నాలుగు నెలల్లో రాబోయే సినిమాలపై అందరి దృష్టి పడింది. 2025లో ఏ సినిమా రూ.1000 కోట్ల మార్క్ అందుకుంటుందా అని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పీరియడ్ డ్రామా కాంతారా చాప్టర్ 1 సినిమాకు మాత్రమే ఈ సంవత్సరం రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించే అందించే అవకాశం ఉంది. ప్రభాస్ ది రాజా సాబ్ పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, అది వాయిదా పడే అవకాశం ఉన్నందున, ఇప్పుడు అందరి చూపు కాంతార వైపు మళ్లింది.

కేజీఎఫ్ ఫ్రాంచైజీ సినిమాలు పాన్ఇండియా బ్లాక్‌బస్టర్‌గా మారిన తర్వాత, కన్నడ చిత్రాల మార్కెట్ పుంజుకుంది. అందుకే కాంతారా చాప్టర్ 1పై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. సినిమాకు టాక్ బాగుంటే మాత్రం ఈ సంవత్సరం రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరే తొలి సినిమాగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News