ఫ్యాన్స్ డిమాండ్.. 'కొత్త' కాంతారకు మరిన్ని థియేటర్లు?

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

Update: 2025-10-03 11:31 GMT

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా.. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకుని మెప్పిస్తోంది.

బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్ గా తెరకెక్కడం.. దసరా సీజన్ లో సినిమా రావడం.. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం.. కాంతార చాప్టర్ 1కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దీంతో ఆడియన్స్.. థియేటర్స్ కు తరలివెళ్తున్నారు. సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో కాంతార ప్రీక్వెల్ రిలీజ్ అయిన థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్నాయి. రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మోస్తరుగా జరగ్గా.. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. సినిమాకు వెళ్లాల్సిందే అన్నట్లు టికెట్లకు గట్టిగా పోటీ పడుతున్నారు.

థియేటర్స్ కు వెళ్ళి సందడి చేస్తున్నారు. అయితే కాంతార ప్రీక్వెల్ ను కొన్ని చోట్ల వేరే సినిమాలతో స్క్రీన్స్ షేర్ చేసుకునే పద్ధతిలో రిలీజ్ చేశారు. ముందు కేవలం ఒక్క షో అంటూ ప్రదర్శించారు. కానీ సినిమాకు హిట్ టాక్ రావడం.. ఆడియన్స్ డిమాండ్ చేయడంతో రెండు షోలకు పెంచారు. కానీ అవి కూడా ఇప్పుడు సరిపోవడం లేదు.

నాలుగు షోలు కూడా కాంతార ప్రీక్వెల్ మూవీనే వేయాలని సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మరిన్ని థియేటర్స్ లో సినిమాను ప్రదర్శించాలని కోరుతున్నారు. అయితే పెయిడ్ ప్రీమియర్స్‌ తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 మూవీ.. రూ.12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రెండో రోజు భారీ వసూళ్లు సాధించేటట్లు ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. వీకెండ్ లో కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవుతాయి. దానికి తోడు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లోని థియేటర్స్ కౌంట్ ను పెంచనున్నారని తెలుస్తోంది. షోస్ కూడా పెంచనున్నారని సమాచారం. దీంతో కాంతార చాప్టర్ 1.. ఇప్పుడు ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News