'కొత్త' కాంతారకు ఏపీ సర్కార్ ఓకే.. అల్లు అరవింద్ ఏమన్నారంటే?

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కాంతార ప్రీక్వెల్.. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది.;

Update: 2025-09-30 16:19 GMT

మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 రూపొందుతున్న విషయం తెలిసిందే. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహిస్తుండగా.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కాంతార ప్రీక్వెల్.. అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. దీంతో మేకర్స్.. రీసెంట్ గా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ను ఆశ్రయించారు. అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

డబ్బింగ్ మూవీలకు ఎందుకు రేట్లు పెంపు అని అనేక మంది ప్రశ్నించగా.. సినీ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో కర్ణాటకలో జరిగిన సంఘటనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాయి. కానీ పవన్ మాత్రం.. మంచి మనసుతో జాతీయ భావనతో ఆలోచించాలని చెప్పారు. కాంతార ప్రీక్వెల్ కు ఆటంకాలు కల్పించొద్దని కోరారు.

ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కాంతార చాప్టర్ 1 మేకర్స్ జీవో అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో స్పందించింది. కళకు హద్దులు లేవంటూ రాసుకొచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలిపింది.

"ఆంధ్రప్రదేశ్‌ లో టికెట్ ధర పెంపును అనుమతించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అది భారతీయ సినిమా, సాంస్కృతిక సామరస్యం పట్ల నిజమైన గౌరవం. కర్ణాటకలో తెలుగు సినిమా విడుదలలకు కూడా కన్నడ చిత్ర పరిశ్రమ అదే మద్దతును అందించాలని మేం అభ్యర్థిస్తున్నాం" అంటూ గీతా ఆర్ట్స్ కోరింది.

తద్వారా పవన్ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే అప్పుడు కాంతార మూవీని రిలీజ్ చేసి గీతా ఆర్ట్స్ సంస్థ భారీ లాభాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆ విషయాన్ని కాంతార మేకర్స్ వెల్లడించారు. సాలిడ్ నెంబర్స్ తో డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News