రిషబ్ ఆ ఆలోచనలో లేడా?
ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నప్పటికీ కాంతార చాప్టర్2 సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పట్టేట్టుంది. దానికి కారణం రిషబ్ శెట్టి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే.;
ఏదైనా ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చి ఆ సినిమా కూడా విపరీతమైన రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకెళ్తే ఆ ఫ్రాంచైజ్ లో వచ్చే నెక్ట్స్ మూవీ కోసం వెయిట్ చేయడం కామన్. ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు ఆడియన్స్. ఇప్పుడు కాంతార చాప్టర్2 కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
కాంతార1కు పాజిటివ్ టాక్
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార సినిమా 2022లో రిలీజై ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ ను అందుకుంది. కాంతారకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్1 ను తీశారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార1 ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కాంతార చాప్టర్2 కోసం ఎదురుచూపులు
మంచి టాక్ తెచ్చుకుంది, పైగా దీపావళి వరకు చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో కాంతార1 అప్పటివరకు బాక్సాఫీస్ వద్ద మంచి రన్ ను అందుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. కాంతార1 మంచి సక్సెస్ ను అందుకోవడంతో కాంతార: చాప్టర్2 ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆడియన్స్, మరీ ముఖ్యంగా కన్నడ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రిషబ్
ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నప్పటికీ కాంతార చాప్టర్2 సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పట్టేట్టుంది. దానికి కారణం రిషబ్ శెట్టి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే. అందులో మొదటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రానున్న జై హనుమాన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. రెండోది రాజమౌళి దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా. ఆల్రెడీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మూడో సినిమా ఛత్రపతి శివాజీ ఆధారంగా రూపొందనున్న బాలీవుడ్ మూవీ. ఈ మూడు సినిమాలూ పూర్తవడానికి ఎంతలేదన్నా మూడేళ్లైనా పట్టొచ్చు.
ఈ కమిట్‌మెంట్స్ కారణంగానే కాంతార2 లేటయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కాంతార చాప్టర్2 తీయడానికి రెడీగా ఉన్నప్పటికీ రిషబ్ వెంటనే దాన్ని మొదలుపెట్టే ఆలోచనలో లేరు. కాంతార2 కు సంబంధించిన కాన్సెప్ట్ ఉన్నా, ఫుల్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాంతార2ను ఆడియన్స్ ఊహించే విధంగా కాకుండా కొత్త నెరేషన్ తో మరింత ఫ్రెష్ గా తీయాలని, అలా తీయాలంటే దానికి మరింత టైమ్ తీసుకుని స్క్రిప్ట్ ను డెవలప్ చేయాలనుకుంటున్నారట రిషబ్. సో కాంతార చాప్టర్2 కోసం లాంగ్ వెయిటింగ్ తప్పదు.