కాంతార చాప్టర్ 1: రిషబ్ శెట్టి బ్లాస్టింగ్ సర్ ప్రైజ్

లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.;

Update: 2025-07-07 05:01 GMT
కాంతార చాప్టర్ 1: రిషబ్ శెట్టి బ్లాస్టింగ్ సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ తర్వాత అదే స్థాయిలో అంచనాలు నెలకొల్పుకున్న సినిమా ‘కాంతార చాప్టర్ 1’. ఫస్ట్ పార్ట్ ఎమోషనల్, మిస్టికల్ థ్రిల్‌తో తెలుగు సహా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో బజ్‌తో ముందుకు వస్తోంది.


లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో రిషబ్ చాలా ఫెరాసియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక్క చేతిలో గొడ్డలి, ఇంకొక చేతిలో షీల్డ్‌ పట్టుకుని యుద్ధంలో యోధుడిలా విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది, ఆ లుక్‌ చూసిన ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో విస్ఫోటనాలు, మిస్టికల్ యాంగిల్ వంటి డిజైన్‌తో ఆ పోస్టర్ అద్భుతంగా కనిపిస్తోంది.


ఈ పోస్టర్‌తో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా వెల్లడి చేశారు మేకర్స్. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉందని వెల్లడించారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 2న దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదలకానుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు రచన, దర్శకత్వం, కథ, నటన అన్నీ రిషబ్ శెట్టి ఒక్కడే స్వయంగా చేస్తుండడం విశేషం. ఇక సినిమా కథ 7వ శతాబ్దం కదంబ రాజ వంశం నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమాకు సంబంధించిన వయలెన్స్, యాక్షన్, ఆధ్యాత్మికత కలగలిపిన భారీ విజువల్ ఫీస్ట్ ఇవ్వాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే 500 మంది ఫైటర్స్‌తో వన్ టేక్ యాక్షన్ సీన్ తెరకెక్కించడం కూడా స్పెషల్ హైలైట్‌గా మారింది.

ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్‌, ఫస్ట్ గ్లింప్స్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు రిషబ్ శెట్టి నుండి వచ్చే విజువల్ ఫీస్ట్ కు సిద్ధంగా ఉన్నారు. జయరాం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది ‘కాంతార’ యూనివర్స్‌లో మరో బిగ్ చాప్టర్ అవుతుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి రిషబ్ శెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్‌తో మరోసారి ‘కాంతార చాప్టర్ 1’ హైప్ పెరిగింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News