కాంతార ప్రీక్వెల్.. ఒక్క రోజులో అన్ని లక్షల టిక్కెట్లా?
అదే సమయంలో కాంతార ప్రీక్వెల్ ఓపెనింగ్స్ రూ. 70 కోట్లు అని వార్తలు రాగా. .అంతకు మించి వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.89 కోట్లకుపైగా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి అదరగొట్టింది.;
కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందడంతో అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వాటిని అందుకుని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలి షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుని సందడి చేస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుని మెప్పిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు వేయగా.. అప్పటి నుంచే బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
అదే సమయంలో కాంతార ప్రీక్వెల్ ఓపెనింగ్స్ రూ. 70 కోట్లు అని వార్తలు రాగా. .అంతకు మించి వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.89 కోట్లకుపైగా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి అదరగొట్టింది. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల జాబితాలో చేరింది. అయితే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో ఒక్క రోజులోనే 1.28 మిలియన్ కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఆ విషయాన్ని బుక్ మై షో నే ప్రకటించింది. 2025లో ఆ పోర్టల్ వేదికగా ఆ రేంజ్ లో టికెట్లు సేల్ కావడం రికార్డు అనే చెప్పాలి. దాని ద్వారా సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. హాట్ కేకుల్లా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రధాన నటుడు, దర్శకుడిగా రిషబ్ శెట్టి భాద్యతలు వహించగా... రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు. రిషబ్ సరసన హీరోయిన్ గా సందడి చేశారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమ్మిడి, రాకేష్ పూజారి, దీపక్ రాయ్, హరి ప్రశాంత్ తదితరులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి కాంతార ప్రీక్వెల్ కు ప్రీమియర్ షోలు నుంచే సాలిడ్ టాక్ రావడం, దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత ఇంట్రెస్ట్ చూపించడం వంటి అంశాలు కలిసొచ్చాయి.