'క‌న్న‌ప్ప' లాక్డ్: మొత్తం ఎన్ని గంట‌లంటే?

మంచు విష్ణు `క‌న్న‌ప్ప` పాన్ ఇండియాలో రిలీజ్ రెడీ అవుతోంది. జూన్ 27న భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.;

Update: 2025-06-06 13:32 GMT

మంచు విష్ణు `క‌న్న‌ప్ప` పాన్ ఇండియాలో రిలీజ్ రెడీ అవుతోంది. జూన్ 27న భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. ప్ర‌భాస్, మోహ‌న్ లాల్, అక్ష‌య్ కుమార్ , మోహ‌న్ బాబు లాంటి న‌టుల‌తో భారీ కాన్వాస్ పై తెర‌కెక్కింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు.

నాటి నుంచి పూర్తి చేసే వ‌ర‌కూ ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసారు. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న స‌మ యంలోనూ ఎన్నో స‌వాళ్లు ఎదుర్కున్నారు. సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ త‌స్క‌ర‌ణ‌కు గురికావ‌డం వంటి ప‌రిస్థితులు విష్ణుకు స‌వాల్ గా మారినా చేధించారు. తాజాగా ఈ సినిమా ర‌న్ టైమ్ లాక్ అయింది. ఈ చిత్రం 3 గంటల 10 నిమిషాల భారీ రన్‌టైమ్‌ను లాక్ చేసింది. `క‌న్న‌ప్ప` పెద్ద క‌థ కావ‌డంతో నిడివి భారీగా పెరిగింది.

పాన్ ఇండియా చిత్రాల నిడివి అన్న‌ది స‌హ‌జంగా మారిందిప్పుడు. `ఆర్ ఆర్ ఆర్` 3 గంటలు 2 నిమి షాలు,` యానిమల్` 3 గంటల 21 నిమిషాలు, `పుష్ప` 3 గంటల నిడివితో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే విజ‌య్ `లియో`, `దేవర` , `సలార్` లాంటి చిత్రాలు అధిక ర‌న్ టైమ్ తోనే రిలీజ్ అయ్యాయి. వీటి ర‌న్ టైమ్ మూడు గంట‌ల‌కు పైగానే ఉంది. ఇవ‌న్నీ మంచి ఫ‌లితాలు సాధించాయంటే కార‌ణం అందులో బ‌ల‌మైన కంటెంట్ ఉండ‌టంతోనే సాధ్య‌మైంది.

క‌థా బ‌లం, ఎమోష‌న్ కుదిరిప్పుడు నిడివి స‌మ‌స్య కాదు. కానీ అందులో ఎక్క‌డా తేడా జ‌రిగినా ఫ‌లితం ఊహించ‌ని విధంగా ఉంటుంది. `క‌న్న‌ప్ప` క‌థ‌కు చాలా ప్రాధాన్య‌త ఉంది. శివుడు-క‌న్న‌ప్ప మ‌ద్య జ‌రిగే పిరియాడిక్ స్టోరీ ఇది. ముఖేష్ కుమార్ సింగ్ ఈచిత్రానికి దర్శకత్వం వ‌హించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మోహన్ బాబు నిర్మించారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు.

Tags:    

Similar News