కంగువా.. తెలుగు డీల్స్ ఎలా ఉన్నాయంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలు దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కంగువా.

Update: 2024-05-17 04:41 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలు దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కంగువా. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 38 భాషలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికే కంగువా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. కచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంగువా సినిమాకి అందించినట్లుగా టీజర్ తోనే స్పష్టమైనది. ఈ చిత్రంలో సూర్య రెండు విభిన్నమైన పాత్రల్లో 2 టైం లైన్స్ లలో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి ట్రైబల్ వారియర్ క్యారెక్టర్ కావడం విశేషం. ఈ పాత్ర చాలా వైలెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కంగువా టీజర్ ని దర్శకుడు శివ ట్రైబల్ వారియర్ క్యారెక్టర్ మీదనే డిజైన్ చేసి ప్రేక్షకులకు అందించారు.

ఈ మూవీలో బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. దిశాపటాని హీరోయిన్ గా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మొదలైపోయింది. డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 100 కోట్ల ధరకి కొనుగోలు చేసిందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ కోసం బడా డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది.

Read more!

అయితే నిర్మాతలు మాత్రం ఏపీ తెలంగాణ కలిపి ఏకంగా 30 నుంచి 40 కోట్ల వరకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. డిస్టిబ్యూటర్స్ భారీగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డీల్ క్లోజ్ అవ్వలేదంట. యూవీ క్రియేషన్స్ మరొక నిర్మాణ సంస్థలతో కలిపి కంగువా మూవీని నిర్మిస్తోంది. మూవీ అవుట్ పుట్ చూసిన తర్వాత యూవీ వాళ్లే స్వయంగా తెలుగులో రిలీజ్ చేస్తారా? లేదంటే వేరే వాళ్ళకు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ 30 నుంచి 40 కోట్ల మధ్యలో తెలుగు వెర్షన్ డీల్ క్లోజ్ అయితే కచ్చితంగా అది రికార్డు అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు సూర్య కెరీర్ లో ఏ మూవీ కూడా ఈ స్థాయిలో తెలుగునాట బిజినెస్ చేయలేదు. కంగువా టీజర్ కి వస్తోన్న స్పందన నేపథ్యంలో కచ్చితంగా తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే డిస్టిబ్యూటర్స్ కూడా సినిమాపై మంచి అంచనా వేస్తున్నారు. అందుకే సినిమా థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News