పిక్‌టాక్ : అందాల ఎంపీ ర్యాంప్ వాక్ అదుర్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ చాలా కాలం తర్వాత ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ చాలా కాలం తర్వాత ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంపీగా గెలిచిన తర్వాత కంగనా కనీసం సినిమాలను కూడా ఎక్కువ చేయడం లేదు. ఆమె సినిమాల సంఖ్య చాలా తక్కువ అయింది. అంతే కాకుండా ఆమె సినిమా కార్యక్రమాలకు హాజరు కావడం కూడా చాలా తగ్గింది. దాంతో ఆమె మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరం అవుతుందా అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఈ సమయంలో ఆమె ఒక ఫ్యాషన్ షో లో పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ కంగనా సొంతం అనే విషయం తెల్సిందే. ఆమె సాధారణంగానే చాలా అందంగా ఉంటుంది. అలాంటిది ఫ్యాషన్ షో లో ర్యాంప్ వాక్ చేస్తే ఖచ్చితంగా జనాలు చూపు తిప్పుకోలేరు అనడంలో సందేహం లేదు. అలాంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ ర్యాంప్ వాక్..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ రాబ్తా నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌లో కంగనా రనౌత్ పాల్గొంది. పెళ్లి కూతురు తరహా మేకోవర్, ఔట్ ఫిట్ తో కంగనా సర్‌ప్రైజ్ చేసింది. విభిన్నమైన జ్యువెలరీ ధరించడం ద్వారా కంగనా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ రంగంలో కంగనా తర్వాతే మరెవ్వరైనా అంటూ చాలా సార్లు నిరూపితం అయింది. ఇప్పుడు మరోసారి ఆమె తన సత్తా చాటింది అనడంలో సందేహం లేదు. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా కంగనా ఇలాంటి ఫ్యాషన్ షో ల ద్వారా అభిమానుల ముందుకు రావడం ద్వారా అంతా హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంగనా అందంకు అంతా ఫిదా అవుతున్నారు, కొందరు మాత్రం ఒక ఎంపీ అయ్యి ఉండి ఇలా ఫ్యాషన్ షో లో పాల్గొనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.
అందమైన కంగనా ఫోటోలు వైరల్
సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్షేషన్ అనడంలో సందేహం లేదు. అలాంటి కంగనా రనౌత్ ఇలా సరికొత్త అలంకరణతో ఆకట్టుకుంటోంది. కంగనా రనౌత్ కి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమె ఎక్కువగా వివాదాలతోనే ఉంటుంది అంటారు. అలాంటి కంగనా ఈ మధ్య కాలంలో సినిమాల గురించి ఎక్కువ మాట్లాడలేదు, అంతే కాకుండా ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరి గురించి విమర్శలు చేయలేదు. సినిమాల్లో కంగనా రీ ఎంట్రీ ఉంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారు అందరికీ ఖచ్చితంగా తాను భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తాను అన్నట్లుగా కంగనా సమాధానం చెప్పుకొచ్చింది. ఎంపీగా ఉన్నప్పటికీ తాను సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ ఇటీవల ఒక చిట్ చాట్‌లో చెప్పిన విషయం తెల్సిందే.
హాలీవుడ్ మూవీలో కంగనా
లేడీ ఓరియంటెడ్ కథల విషయంలో ప్రస్తుతం కంగనా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోతో రొమాంటిక్ సీన్స్ లేకుండా, హీరోల పక్కన హీరోయిన్ పాత్రలు కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం ద్వారా ఎంపీగా తన గౌరవంను కంగనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమె వద్దకు ఫిల్మ్ మేకర్స్ ఉమెన్ సెంట్రిక్ కథలను తీసుకు వెళ్తున్నారట. ఈ మధ్య కాలంలో ఈమె ఒక హాలీవుడ్ సినిమాను చేసేందుకు ఒప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక అనురాగ్ రుద్ర దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించేందుకు కంగనా రెడీ అవుతోంది. అది వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యి, అదే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.