సీక్వెల్ కి ఆ బ్యూటీ ముహూర్తం పెట్టేసిందా!
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `క్వీన్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `క్వీన్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 20 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో కంగన కెరీర్ లో నే ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. నటిగా మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రంగా నిలిచింది. `క్వీన్` తర్వాత అదే తరహా ప్రయత్నాలు కొన్ని చేసింది గానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ నేప థ్యంలో తాజాగా కంగన క్వీన్ సీక్వెల్ ని తెరపైకి తెచ్చింది. మరోసారి వికాస్ బాల్ ని ఆశ్రయించి సీక్వెల్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైందని సమాచారం. వికాస్ లోకేషన్ వేటలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్త లొస్తున్నాయి. క్వీన్ సినిమా తరహాలోనే ఇండియా సహా బయట దేశాల్లోనే చిత్రీ కరణకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వికాస్ లొకేషన్ల కోసం ఓ రెండు దేశాల పర్యటనలో ఉన్నాట్లు సమాచారం. మరో నెల రోజుల్లో లొకేషన్స్ ఫైనల్ అవుతాయని తెలిసింది. అనంతరం నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారుట. క్వీన్ సినిమాకు పని చేసిన టీమ్ నే యధావిధిగా తీసుకోవాలని కంగన-వికాస్ లు భావిస్తున్నారుట.
అయితే నటీనటుల విషయంలో కొత్త వారిని అప్రోచ్ అవుతున్నారుట. అలాగే ఈ సినిమా నిర్మాణంలో కంగన కూడా భాగమవ్వాలని చూస్తోందిట. `క్వీన్` చిత్రాన్ని ఫాంటమ్ పిలింస్ నిర్మించింది. సీక్వెల్ లో భాగంగా ఫాంటమ్ ఫిల్మ్స్ తో పాటు కంగన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ భాగస్వామ్యం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనెలఖరుకల్లా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.
దీన్ని హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాలతో డిలే అవుతుంది. ప్రాజెక్ట్ సెట్స్ కు వెళ్లి చాలా కాలమవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్స్ లేవు. కంగన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంత వరకూ రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో కంగన ఈ చిత్రంతో సంబంధం లేకుండా `క్వీన్` సీక్వెల్ ని పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది.