ప‌డి లేచిన కెర‌టం.. మెగాస్టార్‌కు ఏకంగా 4000 కోట్ల ఆస్తులు!

భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. బిగ్ బి 84వ పుట్టినరోజు సందర్భంగా సినీ జగత్తుతో పాటు కోట్లాదిమంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2026-10-12 03:28 GMT

భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. బిగ్ బి 84వ పుట్టినరోజు సందర్భంగా సినీ జగత్తుతో పాటు కోట్లాదిమంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే విశ్వనటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన‌ ఒక ప్రత్యేక సందేశం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమితాబ్ గాంభీర్యమైన కంఠస్వరం, నటనలోని గంభీరతను కొనియాడుతూ కమల్ హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.




 


కమల్ హాసన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు పెట్టిన కామెంట్లు నెట్టింట సరదా వాతావరణాన్ని సృష్టించాయి. ఇద్దరు దిగ్గజ నటులు ఉన్న ఆ ఫోటోను చూడగానే.. చాలామంది అభిమానులు ``ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది`` అంటూ వ్యాఖ్యానించారు. రెండు జాతీయ స్థాయి ఐకాన్ల ఫోటో కావడం. శీర్షిక చదవకముందు చాలామంది అది సంతాప సందేశం ఏమోనని పొరబడ్డామని తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నామని సరదాగా కామెంట్లు పెట్టారు. అదే సమయంలో కమల్ హాసన్ అద్భుతమైన ఇంగ్లీష్ శైలిని, బిగ్ బిపై ఆయనకున్న గౌరవాన్ని అభిమానులు ప్రశంసించారు.

భారత సినీ చరిత్రలో అమితాబ్ బచ్చన్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. కెరీర్ ప్రారంభంలో అనేక పరాజయాలు ఎదుర్కొని... తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ అప్పుల ఊబిలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని బాలీవుడ్ `యాంగ్రీ యంగ్ మేన్`గా, సూపర్‌స్టార్‌గా ఎదిగారు. శ్రమ, పట్టుదలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయి.

ఇటీవలి నివేదికల ప్రకారం, 84 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ సుమారు 4వేల కోట్ల రూపాయల ఆస్తులతో భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడైన నటుడిగా కొనసాగుతున్నారు. న‌టుడిగా 200కు పైగా చిత్రాల్లో నటించి.. నేటితరం నటులకు సైతం సరిసమానమైన ఉత్సాహంతో బిజీగా గడుపుతున్నారు.

వయసు పెరిగినా నటనపై ఆయనకున్న అంకితభావం తగ్గలేదు. ప్రస్తుతం పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం `కల్కి 2898 AD` సీక్వెల్ `కల్కి-2`లో అశ్వత్థామగా ఆయన మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పర్వదినాన బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరింత కాలం పరిపూర్ణ ఆరోగ్యంతో, ప్రేక్షక లోకాన్ని అలరించాలని చలనచిత్ర పరిశ్రమ మరియు అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News