భాష గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం..!
అందరిలానే మేము మా భాషను ప్రేమిస్తాం. ఎవరైనా మా భాష గురంచి తప్పుగా మాట్లాడితే స్పందించకుండా జనాలు ఉండరు కదా థగ్ లైగ్;
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడలో రిలీజ్ చేయలేదు. దానికి కారణం ఆ సినిమా ప్రమోషన్స్ లో కన్నడ భాష తమిళ్ నుంచి వచ్చిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కన్నడిగులను హర్ట్ చేశాయి. దీనిపై కమల్ తన కామెంట్స్ సరిచేసుకోవాలని చెప్పినా స్పందించలేదు. ఆ విషయంలో తీవ్రంగా హర్ట్ అయిన కన్నడ ఫ్యాన్స్ థగ్ లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా చేశారు. కోర్ట్ క్లియరెన్స్ ఇచ్చినా కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఆ సాహసం చేయలేదు.
ఫైనల్ గా థగ్ లైఫ్ కమల్ కి ఒక భారీ లాస్ ప్రాజెక్ట్ గా మిగిలింది. ఐతే ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన హీరో ధృవ్ సర్జా నటించిన కేడీ ద డెవిల్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. అక్కడ మీడియా వాళ్లు కన్నడ సినిమాలు తమిళ్ లో వస్తున్నాయి. కానీ రీసెంట్ గా ఒక తమిళ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. దానికి ప్రతికారంగా కొందరు తమిళ ప్రజలు కన్నడ సినిమాలు కోలీవుడ్ లో రిలీజ్ చేయకూడదని అంటున్నారు. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటని అడగ్గా.. ధృవ్ సర్జా తాను పుట్టకముందు నుంచే కర్ణాటకలో చాలా తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయని అన్నారు. ఏ ఒక్క సినిమా కూడా ఎవరు ఆపలేదని .. కమల్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆ సినిమాపై వ్యతిరేకత వచ్చిందని క్లారిటీ ఇచ్చారు ధృవ్.
అంతేకాదు ఎలాంటి వారికైనా మాతృభాష మీద గౌరవం ఉంటుంది. అందరిలానే మేము మా భాషను ప్రేమిస్తాం. ఎవరైనా మా భాష గురంచి తప్పుగా మాట్లాడితే స్పందించకుండా జనాలు ఉండరు కదా థగ్ లైగ్ తప్పితే మిగతా తమిళ సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్ణాటకలో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలను అక్కడ ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు అని ధృవ్ సర్జా అన్నారు.
ధృవ్ సర్జా కామెంట్స్ పై తమిళ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. సినిమాలకు భాషపరమైన వ్యతిరేకత ఉండదు. కానీ థగ్ లైఫ్ టైం లో కమల్ హాసన్ కామెంట్స్ వల్ల కన్నడలో ఆ సినిమా రిలీజ్ కాకపోగా రాబోతున్న కన్నడ సినిమాలకు తమిళ భాషలో ఇలాంటి చిక్కులే ఎదురయ్యేలా ఉన్నాయి.