పహాల్గాంకి 'విశ్వరూపం-3' కోసమేనా కమల్ జీ?
ఈ ఘటన తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ పహాల్గాం పర్యటిస్తానని వెల్లడించారు.;
పహాల్గాం ఘటన ప్రపచం వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఉగ్రదాడిలో భాగంగా భారతీయులు అసువులు బాసారు. అత్యంత కర్కశంగా మతం అడిగి మరీ దాడికి పాల్పడ్డారు. ప్రతిగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఇద్దరు భారతీయ మహిళలతోనే పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు ధీటైన బధులిచ్చింది. భారత్ కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందన్నది దాయాదికి మరోసారి అర్దమైంది. దీంతో శాంతి చర్చలకు దిగి రావాల్సి వచ్చిన ఎపిసోడ్ అంతా తెలిసిందే.
ఈ ఘటన తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ పహాల్గాం పర్యటిస్తానని వెల్లడించారు. టూరిజం పెంచడం లో భాగంగా పహాల్గాం వెళ్తానన్నారు. తన లాంటి వాళ్లు అక్కడి వెళ్తే సాధారణ ప్రజలకు మళ్లీ పహాల్గా వెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్న కోణంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే తాజాగా కమల్ పర్యటన వెనుక మరో విషయం కూడా తెరపైకి వస్తుంది. కమల్ 'విశ్వరూపం 3'కి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
పహాల్గాం ఘటనకు ముందే ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. 'విశ్వరూపం 2'కి కొనసాగింపుగా మూడవ భాగం ఉంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. రెండు భాగాలు కూడా ఉగ్రవాదం నేపథ్యంలో విశ్వరూపం ప్రాంచైజీని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో కమల్ పహాల్గాం పర్యటనకు 'విశ్వరూపం 3'కి ఏమైనా సంబంధాలున్నాయా? అన్నఅంశం తెరపైకి వస్తుంది.
పహాల్గాం దాడికి పాల్పడింది ఐఎస్ ఐ అనుబంధ ఉగ్ర సంస్థగా ప్రకటించుకుంది. 'విశ్వరూపం'లో ఉగ్రవాదం ఎలా పురుడు పూసుకుంటుంది. దాని మూలాలు ఎలా ఉంటాయి? అన్నది కమల్ గొప్పగా చూపించారు. ఆ రెండు చిత్రాల్లో కమల్ రా ఏజెంట్, స్పై పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.