కమల్ ఇకనైనా జాగ్రత్త పడాల్సిందే!
ఇండియన్2, థగ్ లైఫ్ సినిమాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్న కమల్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.;
లోకనాయకుడు కమల్ హాసన్ మళ్లీ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఇండియన్2, థగ్ లైఫ్ సినిమాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్న కమల్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కమల్ నెక్ట్స్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. నవంబర్ 7న కమల్ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
నవంబర్ 7న కమల్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్
దీంతో కమల్ కొత్త సినిమా గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ కమల్ కెరీర్లో 237వ సినిమా అవుతుందా లేదా 238వ సినిమా అవుతుందా అనేది అనౌన్స్‌మెంట్ వస్తే కానీ క్లారిటీ రాదు. సోషల్ మీడియాలో దీని గురించి ఊహాగానాలు పెరుగుతుండటంతో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ పై అందరూ ఉత్సాహంగా ఉన్నారు.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న కమల్
అప్పటివరకు సక్సెస్ లో లేని కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమల్ కెరీర్ కు చాలా ఊరటనిచ్చింది. గతంలో విశ్వరూపం1 తర్వాత ఎలాగైతే వరుస ఫ్లాపులొచ్చాయో, ఇప్పుడు మళ్లీ కమల్ అలాంటి పొజిషన్ లోనే ఉన్నారు. ఈ కారణంతోనే కొందరు కమల్ ను రజినీతో కంపేర్ చేస్తున్నారు.
రజినీతో పోలికలు
కమల్ ను రజినీతో పోల్చడం చూసిన కొందరు దాన్ని ఖండిస్తూ, కూలీ లాంటి సినిమా తర్వాత కూడా రజినీకాంత్ క్రేజ్ ఇండస్ట్రీలో ఏ మాత్రం తగ్గలేదని, ఇప్పటికీ ఆయన లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా కమల్ తనకు సరిపోయే మంచి కథలను ఎంచుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా కమల్ 237వ సినిమాగా అన్బరివ్ తో ఆల్రెడీ సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ, కమల్ కు వచ్చిన ఫ్లాపుల కారణంగా ఆ సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్టును నవంబర్ 7న అనౌన్స్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కమల్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ సాలిడ్ హిట్ అవసరం. మరి కమల్ ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారో, దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది త్వరలోనే తెలియనుంది.