'కల్కి' గురించి ఫ్యాన్స్‌ లో కొత్త డౌటానుమానం..!

సినిమా ఎలాగూ వాయిదా పడింది కదా అని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ఇంకా చేస్తూనే ఉన్నారు.

Update: 2024-05-10 06:32 GMT

ప్రభాస్ ఫ్యాన్స్‌ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి సినిమా జూన్‌ 2898 ఏడీ సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మే 9న విడుదల అవ్వాల్సి ఉన్న కల్కి సినిమాను ఎన్నికలు, ఐపీఎల్‌ ఇతర కారణాల వల్ల జూన్ కి వాయిదా వేశారు.

సినిమా ఎలాగూ వాయిదా పడింది కదా అని పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ఇంకా చేస్తూనే ఉన్నారు. క్వాలిటీ విషయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్ రాజీ పడకుండా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయిస్తున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విడుదలకు ఇంకా 50 రోజుల సమయం కూడా లేదు. అయినా కూడా ప్రమోషనల్‌ హడావుడి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ మధ్య కాలంలో విడుదలకు రెండు మూడు నెలల ముందు నుంచే సినిమాల యొక్క పాటలను విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కల్కి కి సంబంధించిన ఎలాంటి పాటను విడుదల చేయలేదు. ఈ సమయంలో కల్కి సినిమాలో అసలు ఒక్క పాట అయినా ఉందా అనే కొత్త అనుమానం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు సంతోష్ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. కనుక పాటలు ఉండే ఉంటాయి. కానీ ఎందుకు వాటిని ప్రమోషన్ కోసం విడుదల చేయడం లేదు అంటూ మరి కొందరు నెట్టింట కల్కి సినిమా ప్రమోషన్ గురించి చర్చిస్తున్నారు.

Read more!

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు దాదాపు అంతా కూడా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ లో బిజీగా ఉన్నారు. మరో రెండు వారాల వరకు అదే పని ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రమోషన్ ను పెట్టుకోవడం కరెక్ట్‌ కాదు అనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ పాటల విడుదలకు సిద్ధం అవ్వడం లేదని ఇన్ సైడ్ టాక్‌.

ప్రభాస్‌ తో పాటు అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్న కారణంగా కల్కి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతే కాకుండా పాన్‌ వరల్డ్‌ మూవీ అన్నట్లుగా కూడా ఈ టైమ్‌ ట్రావెలర్‌ ను ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న ఈ సినిమా విడుదల ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News