• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి 2898AD: యూఎస్ లో...

కల్కి 2898AD: యూఎస్ లో ఊచకోత అగట్లేదుగా..

| మరోసారి డార్లింగ్ ప్రభాస్ ఓవర్సీస్ రారాజు అనిపించుకుంటున్నాడు. కలెక్షన్స్ పరంగా తన మార్కెట్ ని ఎవరూ టచ్ చేయలేరని ప్రూవ్ చేసుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-06-26 07:28 GMT

మరోసారి డార్లింగ్ ప్రభాస్ ఓవర్సీస్ రారాజు అనిపించుకుంటున్నాడు. కలెక్షన్స్ పరంగా తన మార్కెట్ ని ఎవరూ టచ్ చేయలేరని ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా తన రికార్డ్ ని మళ్ళీ తాను మాత్రమే బ్రేక్ చేయగలనని కల్కి 2898ఏడీ మూవీ తో ప్రభాస్ నిరూపించుకున్నాడు. జూన్ 26న స్పెషల్ ప్రీమియర్ షోలతో నార్త్ అమెరికాలో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

భారీ అంచనాల మధ్యలో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని రెండు వారాలు ముందుగానే నార్త్ అమెరికాలో ఓపెన్ చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా టికెట్స్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఈ మూవీ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఒక్క నార్త్ అమెరికాలోనే 4 మిలియన్ డాలర్స్ వచ్చాయంటే యూకే, అరబిక్ కంట్రీస్ మిగిలిన ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

నార్త్ ఇండియాలో ప్రీరిలీజ్ కలెక్షన్స్ పరంగా కల్కి మూవీ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్స్ ప్రీరిలీజ్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా కల్కి నిలిచింది. ప్రీమియర్ షోలకి లక్ష టికెట్స్ అమ్ముడైన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా మరో అరుదైన ఘనతని కల్కి సొంతం చేసుకుంది. అలాగే ప్రీమియర్ షో ద్వారా 1.3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ అందుకుంది.

ఎవరి అంచనాలకి అందకుండా వచ్చిన కల్కి మూవీ మీద నెల రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. టీమ్ ప్రమోషన్ స్ట్రాటజీ, మూవీ నుంచి వచ్చిన ట్రైలర్స్ తోనే పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో కల్కి మూవీ కలెక్షన్స్ పరంగా వండర్స్ క్రియేట్ చేస్తుందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటికే మొదటి మూడు రోజులకి టికెట్స్ బుక్ అయిపోయాయంట.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కచ్చితంగా 10 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ఓవర్సీస్ లో కల్కి మూవీ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో కచ్చితంగా హాలీవుడ్ మేకర్స్ సైతం కల్కి 2898ఏడీ సినిమా పై రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
  • Kalki2898ad 
  • Prabhas 
  • Nagashwin 
  • Kamalhaasan 
  • Deepikapadukone 
  • Ashwinidutt 
  • Boxoffice 
  • Overseas 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS