అవకాశాన్ని జీన్స్ ప్యాంట్ తో పోల్చిన హీరోయిన్!
బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో `కల్ హో నా హో` ఒకటి. ఈ చిత్రంలో నైమా పాత్రలో ప్రీతీ జింటా నటనను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.;
బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో `కల్ హో నా హో` ఒకటి. ఈ చిత్రంలో నైమా పాత్రలో ప్రీతీ జింటా నటనను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ఈ ఐకానిక్ పాత్ర కోసం దర్శక నిర్మాతల మొదటి ఛాయిస్ ప్రీతీ జింటా కాదు అన్న విషయం చాలా మందికి తెలియదు. తొలుత ఈ అవకాశం స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వద్దకు వెళ్ళింది. కానీ, కొన్ని కారణాల వల్ల కరీనా ప్రాజెక్టును వదులుకోవడంతో ఆ లక్కీ ఛాన్స్ ప్రీతీ జింటాను వరించింది. ఈ పరిణామాన్ని ప్రీతీ జింటా వివరించిన తీరు నెటి జనుల్ని ఆకర్షిస్తోంది. సినిమా అవకాశాలను ప్రీతీ జింటా ఒక 'జీన్స్ ప్యాంట్'తో పోల్చడం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది.
`సినిమా అవకాశాలు అనేవి జీన్స్ ప్యాంట్ లాంటివి. షాప్ కి వెళ్లి సరిపోయే జీన్స్ నే మీరు ఎంచుకుంటారు. కానీ దాన్ని కొడనం..కొనకపోవడం అన్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత అదే ప్యాంట్ ను మరొకరు వచ్చి ట్రైల్ వేస్తారు .అతడికి సరిపోతుంది. అతడు వెంటనే ఆ ప్యాంట్ కొనేస్తాడు. దీంతో ఆ ప్యాంట్ అతడి సొంత మవుతుంది. కల్ హో నా హో సినిమాలో అవకావం కూడా తనకు అలాగే వచ్చిందంది. తొలుత ఆ పాత్ర కోసం కరీనాకపూర్ ను పరిశీలించారు. ఆ పాత్రకు ఆమె కూడా పక్కా యాప్ట్ అయింది. కానీ ఆ సినిమాలో తను ఎందుకనో నటించలేదు.
ఆ తర్వాత మేకర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. పాత్ర నాకు సరిపోతుందని అనిపించి ఒకే చెప్పాను`అంది. `కల్ హో నా హో` సినిమాలో నైనా పాత్ర ప్రీతీ జింటా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ పాత్రలో అమ్మడి పరిణతి, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకవేళ కరీనా కపూర్ ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ? ప్రీతీ మాత్రం ఆ పాత్రకు నిండుతనాన్ని తీసుకొచ్చింది. అందుకే ఒకరు వద్దనుకున్నది మరొకరికి అదృష్టంగా మారడం అనేది యాదృచ్ఛికం కాదని అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అ ప్రతీజింటా అంటోంది. ఏ రంగంలోనైనా పోటీ, ఈర్ష్య అనేవి సహజం.
ఒక హీరోయిన్ వదులుకున్న పాత్రను మరొకరు చేసినప్పుడు రకరకాల చర్చలు నడుస్తుంటాయి. కానీ ప్రీతీ జింటా ఆ చర్చలకు తావు లేకుండా జీన్స్ ప్యాంట్ లాజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పోలిక వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటంటే? ప్రతిభ ఉన్నా? కొన్నిసార్లు సమయం, సందర్భం కూడా నటుడి విజయానికి ముఖ్యమని ప్రీతీజింటా నమ్ముతుంది. తనకు దక్కిన అవకాశాన్ని ఆమె ఎంతో గౌరవంగా స్వీకరించారు. ప్రీతీ జింటా చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాలకే కాదు. నిజ జీవితానికి కూడా వర్తిస్తాయి. మనకు దక్కనిది మన కోసం కాదని మనకు దక్కినది మనకు సరిగ్గా సరిపోతుందని భావించడం వల్ల జీవితంలో అసంతృప్తి తగ్గుతుంది. కరీనా కపూర్ వదులుకున్న ఆ పాత్రను ప్రీతీ సొంతం చేసుకుని దాన్ని ఒక చిరస్మరణీయ పాత్రగా తీర్చిదిద్దింది. నేటికీ ఆ సినిమా గురించి మాట్లాడితే ప్రీతీ జింటా గుర్తుకు రావడమే ఆమె సాధించిన అతిపెద్ద విజయం.