స్పిరిట్.. ఆ లేడీ సూపర్ స్టార్ ఎంట్రీతో సీన్ మారుతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే ఆడియన్స్ మైండ్ లో 'వైలెన్స్' ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అంచనా వచ్చేస్తుంది.;
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే ఆడియన్స్ మైండ్ లో 'వైలెన్స్' ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అంచనా వచ్చేస్తుంది. ఇన్నాళ్లు స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ అంటూ ఊరించిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగింది. అయితే షూటింగ్ మొదలవ్వడమే ఒక భారీ యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వంగా తన మార్క్ చూపించడం అప్పుడే మొదలుపెట్టాడని ఇన్ సైడ్ టాక్.
రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ఒక జైలు సెట్ బ్యాక్ డ్రాప్ లో మొదలైంది. సాధారణంగా ఫస్ట్ షెడ్యూల్ లో టాకీ పార్ట్ లేదా చిన్న సీన్స్ ప్లాన్ చేస్తారు. కానీ సందీప్ వంగా మాత్రం ప్రభాస్ ను నేరుగా యాక్షన్ లోకి దించేశాడు. కరుడుగట్టిన ఖైదీలు, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. స్టార్టింగ్ లోనే ఇంత హీట్ ఉంటే, సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తికరంగా ఉంది. మిగతా కమిట్మెంట్స్ అన్నింటినీ పక్కన పెట్టి, ఏకంగా కొన్ని నెలల బల్క్ డేట్స్ ను వంగాకు ఇచ్చేశారట. అంటే మరికొంత కాలం ప్రభాస్ పూర్తిగా 'స్పిరిట్' లోకంలోనే గడపనున్నారు. లుక్, బాడీ లాంగ్వేజ్ కన్సిస్టెంట్ గా ఉండటం కోసం ఈ బల్క్ డేట్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ ఫిదా అవుతోంది.
ఇక ఈ సినిమాలో కాస్టింగ్ గురించి ఒక క్రేజీ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ ను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారట. గతంలో కరీనా కపూర్ పేరు వినిపించినా, ఇప్పుడు ఆ ప్లేస్ లోకి కాజోల్ పేరు వచ్చింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, కాజోల్ కు ఇదే తొలి తెలుగు సినిమా అవుతుంది.
సందీప్ వంగా తన సినిమాల్లో పాత్రలను ఎంత బలంగా రాస్తారో 'యానిమల్' చూస్తే అర్థమవుతుంది. బాబీ డియోల్ లాంటి వారిని వాడుకున్న తీరు అద్భుతం. ఇప్పుడు కాజోల్ లాంటి పవర్ ఫుల్ నటిని ప్రభాస్ సినిమాలోకి తెస్తున్నారంటే, ఆ పాత్రకు కథలో చాలా ప్రాధాన్యత ఉండి ఉంటుంది. ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రనా, లేక సపోర్ట్ చేసే పాత్రనా అనేది సస్పెన్స్.
ఏదేమైనా 'స్పిరిట్' అటు యాక్షన్ పరంగా, ఇటు కాస్టింగ్ పరంగా రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. జైలు గోడల మధ్య ప్రభాస్ చేసే విధ్వంసం, కాజోల్ ఎంట్రీ రూమర్స్ సినిమాపై హైప్ ను డబుల్ చేస్తున్నాయి. అఫిషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ ఈ కాస్టింగ్ న్యూస్ పై క్లారిటీ రాదు. ప్రస్తుతానికి మాత్రం ప్రభాస్ వంగా జైలులో ఫుల్ బిజీ.