బ్యూటీ కొల‌త‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కాజ‌ల్!

అయితే మారుతున్న కాలంతో పాటు ఈ అంచనాలు మరింత కఠినంగా మారుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సామాజికంగా సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. సినిమా రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న కాజల్ అగర్వాల్ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు.

Update: 2026-07-04 12:30 GMT

గ్లామర్ ప్రపంచంలో నటీమణులపై ఉండే శారీరక ఒత్తిళ్లు, రూపాన్ని బట్టి చేసే విమర్శలు ఈనాటివి కావు. వెండితెరపై కనిపించే కథానాయికలు నిర్దేశిత కొల తలతో, అందంగా కనిపించాలనే నిబంధన చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ అంచనాలు మరింత కఠినంగా మారుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సామాజికంగా సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. సినిమా రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న కాజల్ అగర్వాల్ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు.

తాను పరిశ్రమకి కొత్తలో కూడా నటీమణుల శరీర ఆకృతిపై దర్శకులు, నిర్మాతల నుంచి ఒత్తిళ్లు ఉండేవని పేర్కొన్నారు. కొన్ని సినిమాల కోసం తనను లావుగా అవ్వాలని, మరికొన్ని పాత్రల కోసం సన్నబడాలని చిత్ర నిర్మాతలు కోరిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. కేవలం శారీరక రూపాన్ని బట్టి అంచనా వేసే ధోరణి అప్పట్లోనూ ఉండేదని వివరించారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని కాజల్ ఆందోళన వ్యక్తం చేశారు. తాము కెరీర్ ప్రారంభించిన రోజుల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం లేదని దీనివల్ల బాహ్య ప్రపంచం నుండి వచ్చే విమర్శల ఒత్తిడి చాలా తక్కువగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

కేవలం షూటింగ్స్.. పాత్రల పరిధులకే ఆ అంచనాలు పరిమితమయ్యేవని వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉండేదని వెల్లడించారు. నేటి డిజిటల్ యుగంలో నటీమణుల పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం సౌందర్య ప్రమాణాలు కృరంగా దయాదాక్షిణ్యాలు లేనివిగా తయారయ్యాయని అన్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా విమానా శ్రయాల్లో కనిపించే సాధారణ లుక్స్ నుండి ప్రతి చిన్న బహిరంగ ప్రదర్శన వరకు నెటిజన్లు తీక్షణంగా గ‌మ‌నించి విమర్శలు గుప్పిస్తున్నార‌న్నారు. నిరంతరం మేకప్‌తో, ఖరీదైన దుస్తులతో పరిపూర్ణంగా కనిపించాలనే ఆధునిక ఒత్తిడిని చూస్తుంటే యువ నటీమణుల పట్ల జాలేస్తుంద‌ని కాజల్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి కఠినమైన వాతావరణంలో యువ నటీమణులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. పరిశ్రమలో మనుగడ సాగించాలంటే నటనతో పాటు మానసిక దృఢత్వం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. బాహ్య విమర్శలను పక్కనపెట్టి తమ పరిధులను తామే నిర్ణయించుకుని పరి శ్రమలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవాలని నేటి తరం నాయికలకు సూచించారు.

గ్లామర్ ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ నటిగా తన ఉనికిని చాటుకోవడంలో మానసిక స్థైర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుందని కాజల్ మాటలను బట్టి అర్థమవుతుంది. బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యతనిచ్చే ఇలాంటి ధోరణి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా వాడకం పెరిగిన నేటి సమాజంలో సాధారణ మహిళలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. శారీరక రంగు, రూపురేఖలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది.

Tags:    

Similar News