ఖైదీ2 గురించి కార్తీ అలా అనేశాడేంటి?

ఓవ‌ర్ నైట్ లో జ‌రిగిన స్టోరీని తెర‌కెక్కించి హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆ సినిమాతో ఓ కొత్త సినిమాటిక్ యూనివ‌ర్స్ ను క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్;

Update: 2025-12-11 05:56 GMT

2019లో కార్తీ హీరోగా వ‌చ్చిన ఖైదీ సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓవ‌ర్ నైట్ లో జ‌రిగిన స్టోరీని తెర‌కెక్కించి హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆ సినిమాతో ఓ కొత్త సినిమాటిక్ యూనివ‌ర్స్ ను క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్. ఖైదీ కంటే ముందే లోకేష్ మా న‌గ‌రం లాంటి సినిమా తీసి మంచి హిట్ అందుకున్న‌ప్ప‌టికీ త‌న‌కు స్టార్‌డ‌మ్ ను తెచ్చిపెట్టింది మాత్రం ఈ సినిమానే.

ఖైదీతో సినిమాటిక్ యూనివ‌ర్స్ ను మొద‌లుపెట్టిన లోకేష్

ఖైదీతో మొద‌లైన లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ కు ఇప్ప‌టికీ ఎంతో డిమాండ్ ఉందంటే దానికి స్ట్రాంగ్ రీజ‌న్ ఖైదీ ఇచ్చిన ఇంపాక్టే. అలాంటి ఖైదీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అటు లోకేష్, ఇటు కార్తీ ఎప్ప‌ట్నుంచో చెప్పుకుంటూ వ‌స్తున్నారు. లోకేష్ అయితే త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ లో చేసిన ప్ర‌తీ సినిమాకీ మ్యాక్సిమం సీక్వెల్స్ ఉంటాయ‌ని చెప్తున్నారు కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకీ సీక్వెల్ ను మొద‌లుపెట్టింది లేదు.

లోకేష్ పై కూలీ ఎఫెక్ట్

అయితే అన్నింటికంటే ముందుగా కార్తీతో ఖైదీ2 నే ముందు మొద‌లుపెడ‌తాన‌ని ఎప్ప‌ట్నుంచో చెప్తున్నారు లోకేష్. దీంతో ఖైదీ2 కోసం ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వెయిటింగే త‌ప్పించి ఖైదీ2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. లోకేష్ నుంచి ఆఖ‌రిగా వ‌చ్చిన కూలీ సినిమా ఎఫెక్ట్ అత‌ని కెరీర్ పై బాగానే ప‌డింది అందుకే అత‌ను చేయాల‌నుకున్న సినిమాల‌న్నీ హోల్డ్ లో ఉన్నాయి.

ఖైదీ2 అప్డేట్ గురించి తెలియ‌దు

కూలీ త‌ర్వాత లోకేష్ చేయాల‌నుకున్న ర‌జినీ- క‌మల్ మ‌ల్టీస్టార‌ర్ చేజార‌గా, ఆమిర్ ఖాన్ తో అనుకున్న సినిమా ఉంటుందో లేదో తెలియని ప‌రిస్థితి. స‌రే ఇవ‌న్నీ వ‌ద్దులే కార్తీతో ఖైదీ2 చేద్దామంటే ఆ ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్ల‌డం లేదో అర్థం కావ‌డం లేదు. రీసెంట్ గా అన్న‌గారు వ‌స్తారు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కార్తీని ఖైదీ2 అప్డేట్ అడ‌గ్గా, దాని గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న‌కు తెలియ‌ని అప్డేడ్ ఖైదీ2నే అని చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రచ‌డంతో పాటూ అస‌లు ఈ సినిమా ఉంటుందా లేదా అనే కొత్త అనుమానాల‌కు దారి తీస్తుంది. నిజం చెప్పాలంటే ప్ర‌స్తుతం లోకేష్ ఉన్న సిట్యుయేష‌న్స్ లో ఖైదీ2 ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లి ఆ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తే తిరిగి లోకేష్ బిజీ అవ‌డం ఖాయం. కానీ లోకేష్ ఆ దిశ‌గా ఎందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌నేది అత‌నికే తెలియాలి.

Tags:    

Similar News