మెగా 158 టైటిల్ గ్లింప్స్: గన్స్ తో ట్విస్ట్ ఇచ్చిన 'కాక'
ఆ తర్వాత వీడియోలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఫ్యాక్టరీలోని నీళ్లలో పడిపోయిన ఐ లవ్ డాడ్ కీ చైన్ ఉన్న స్కూటర్ తాళాల కోసం ఒక పెద్ద మాగ్నెట్ ను క్రేన్ సాయంతో కిందకు దించుతారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా 158 ప్రాజెక్ట్ అప్డేట్ రానే వచ్చింది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు 'కాక' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫైనల్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఈ టైటిల్ గ్లింప్స్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు.
ఈ గ్లింప్స్ లోని విజువల్స్ చూస్తే దర్శకుడు ఎంచుకున్న కథా నేపథ్యం మామూలుగా ఉండదని అర్థమవుతుంది. ఆక్వా ఇండస్ట్రీస్ లో పనిచేసే సూపర్ వైజర్ సత్యం పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. మొదట ఒక సాధారణ ఫ్యాక్టరీ వాతావరణం, రొయ్యల పెంపకం, వర్కర్స్ తమ పనుల్లో బిజీగా ఉండే కంప్లీట్ గ్రౌండెడ్ సెటప్ తో ఈ వీడియో చాలా ప్రశాంతంగా మొదలవుతుంది.
సరిగ్గా ఇదే సెటప్ లో సినిమా స్థాయిని పెంచే ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ కూడా వినిపిస్తుంది. చెన్నై పోర్టుకు సరుకు వస్తుంది కదా.. ఇది సత్యం మాట, ఇంకా డౌటా అంటూ.. ఫోన్ లో ఎవరికో సీరియస్ గా చెప్పే డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది. క్యారెక్టర్ లో ఫ్యాన్స్ కోరుకునే కాంటెంట్ ఉందనిపిస్తోంది. అయితే ఒక ఆక్వా ఫ్యాక్టరీ సూపర్ వైజర్ కు అంత దూరాన ఉన్న పోర్టులతో ఉన్న లింక్ ఏంటి అనే క్యూరియాసిటీని కూడా డైరెక్టర్ బాబీ ఈ డైలాగ్ తోనే క్రియేట్ చేశాడు.
ఆ తర్వాత వీడియోలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఫ్యాక్టరీలోని నీళ్లలో పడిపోయిన ఐ లవ్ డాడ్ కీ చైన్ ఉన్న స్కూటర్ తాళాల కోసం ఒక పెద్ద మాగ్నెట్ ను క్రేన్ సాయంతో కిందకు దించుతారు. ఆ మాగ్నెట్ తిరిగి పైకి వచ్చేటప్పుడు కేవలం ఆ తాళాలే కాకుండా భారీ సంఖ్యలో గన్స్ కూడా దానికి అతుక్కుని రావడం ఈ గ్లింప్స్ కే పెద్ద హైలైట్ గా నిలిచింది. దీంతో అప్పటివరకు ఉన్న మూడ్ పూర్తిగా హై వోల్టేజ్ యాక్షన్ వైపు టర్న్ అవుతుంది.
ఆ గన్స్ బయటకు రాగానే చిరంజీవి ఎంట్రీ ఇచ్చే విజువల్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. డైరెక్టర్ బాబీ తనదైన మార్క్ తో వింటేజ్ చిరును గుర్తుచేసేలా ఒక పవర్ ఫుల్ యంగ్ లుక్ లో మెగాస్టార్ ను ఇక్కడ ప్రెజెంట్ చేశాడు. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాత గ్యాంగ్ లీడర్ సినిమాలోని క్లాసిక్ గ్యాంగ్ గ్యాంగ్ సాంగ్ బీట్ ను బ్యాక్ గ్రౌండ్ లో వాడిన తీరు యాక్షన్ సీన్స్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ తో చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ ఇంపాక్ట్ చూపించడం ఖాయమని ఈ గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నటి అనశ్వర రాజన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఒక పక్కా లోకల్ స్టోరీకి భారీ యాక్షన్ ను మిక్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.